India Covid-19: గుడ్‌న్యూస్.. తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు..

|

Oct 17, 2021 | 9:47 AM

India Corona Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో

India Covid-19: గుడ్‌న్యూస్.. తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు..
India Corona
Follow us on

India Corona Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయమేంటంటే.. ఇటీవల కేసుల సంఖ్య 20వేలకు దిగువన నమోదవుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,146 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 144 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య తగ్గింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 1,95,846 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సెకండ్ వేవ్ అనంతరం యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు దిగువకు నమోదు కావడం ఇదే మొదటిసారి. దాదాపు ఆరు నెలల తరువాత యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు దిగువన నమోదయ్యాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,67,719 కి పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య 4,52,124 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 19,788 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,34,19,749 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. కాగా దేశంలో రికవరీ రేటు భారీగా పెరుగుతోంది. మార్చి తర్వాత రికవరీ రేటు 98 శాతానికి పైగా పెరిగినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 97,65,89,540 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న దేశవ్యాప్తంగా 41,20,772 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

Crime News: భార్యపై అనుమానం.. తాగిన మైకంలో నాటు తుపాకీతో కాల్చిన భర్త.. చివరకు..

Crime News: దారుణం.. ఐదేళ్లుగా బాలికపై అత్యాచారం.. తండ్రితో సహా ఎస్పీ, బీఎస్పీ నాయకుల అరెస్ట్..