Delta Plus variant: డెడ్లీ డెల్టా ప్లస్ పంజా.. ఆ రాష్ట్రంలో వరుస మరణాల కలకలం

| Edited By: Janardhan Veluru

Aug 14, 2021 | 10:15 AM

Covid-19 Delta Plus Variant: మహారాష్ట్రలో కరోనావైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ విజ‌ృంభిస్తోంది. ఇప్పటివరకు డెల్టావేరియంట్‌తో ఐదుగురు మరణించినట్లు అధికారులు

Delta Plus variant: డెడ్లీ డెల్టా ప్లస్ పంజా.. ఆ రాష్ట్రంలో వరుస మరణాల కలకలం
Delta Plus Variant
Follow us on

Covid-19 Delta Plus Variant: మహారాష్ట్రలో కరోనావైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ విజ‌ృంభిస్తోంది. వరుస మరణాలు ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటివరకు డెల్టావేరియంట్‌తో రాష్ట్రంలో ఐదుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.  మహారాష్ట్రలోని ముంబై, బీడ్, రత్నగిరి, రాయగఢ్ ప్రాంతాల్లో 66 మందికికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన వారంతా 65 ఏళ్ల వయసు పైబడిన వారు కావడంతోపాటు వారికి ఇతర అనారోగ్యాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా డెల్టా వేరియంట్ వల్ల రత్నగిరిలో ఇద్దరు, ముంబై, బీడ్, రాయగఢ్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు.

కాగా.. డెల్టా ప్లస్ వైరస్ వల్ల మరణించిన వారిలో టీకాలు వేయించుకున్నవారు కూడా ఉండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం థానే నగరంలో మరో డెల్టా ప్లస్ వేరియంట్ కొత్త కేసు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎక్కువగా ముంబై, పూణే నగరాల్లో డెల్టాప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

జల్గావ్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. రత్నగిరి జిల్లాలో 12, ముంబైలో 11 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు నమోదైన 66 డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల్లో 32 మంది పురుషులున్నారు. ఏడుగురు రోగులు 18 ఏళ్ల లోపువారు కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న డెల్టావేరియంట్ కేసులతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది.

Also Read:

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. నెమ్మదిగా దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కానీ మన నగరంలో ఇలా..

TMC – BJP: ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. తేల్చి చెప్పిన దీదీ ప్రధాన అనుచరుడు.. ఇదో కొత్త రకం గేమ్..