Mizoram Polling Result: మిజోరాంలో కొనసాగుతున్న కౌంటింగ్.. పెద్దగా ప్రభావం చూపని బీజేపీ, కాంగ్రెస్

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిశంబర్ 3న వెల్లడైనప్పటికీ.. మిజోరాంలో మాత్రం సోమవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. మొత్తం 13 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Mizoram Polling Result: మిజోరాంలో కొనసాగుతున్న కౌంటింగ్.. పెద్దగా ప్రభావం చూపని బీజేపీ, కాంగ్రెస్
Counting Of Assembly Elections In Mizoram Is Ongoing

Updated on: Dec 04, 2023 | 8:57 AM

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిశంబర్ 3న వెల్లడైనప్పటికీ.. మిజోరాంలో మాత్రం సోమవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. మొత్తం 13 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మిజోరాం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్. లియాంజెలా తెలిపారు. ఈ రాష్ట్రంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 80శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగారు.

మిజోరాంలో మొత్తం 40 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మూడు పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇందులో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరం పీపుల్స్ మూవ్ మెంట్ (జడ్ పీ ఎం), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26, జడ్ పీ ఎం 8, కాంగ్రెస్ 5, బీజేపీ 1 స్థానంలో గెలుపొందాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ స్థానాలు 21 కాగా గతంలో ఎంఎన్ఎఫ్ 26 స్థానాలను కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించిన దానిప్రకారం మరో సారి మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని తెలిపింది. జోరం పీపుల్స్ పల్స్ 12 నుంచి 18 స్థానాలు కైవసం చేసుకొని రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్ ల ప్రభావం పెద్దగా ఉండదని తేల్చింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ ప్రకారం జడ్ పీ ఎం 13, ఎంఎన్ఎఫ్ 8, బీజేపీ 2, కాంగ్రెస్ 2 స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..