Cough syrup row: 20 మంది చిన్నారుల మృతికి కారణం అయిన సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్

ఇటీవల దగ్గు సిరప్ వల్ల 20 మంది పిల్లలు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మందును తయారు చేసే కోల్డ్‌రిఫ్ కంపెనీ యజమాని రంగనాథన్ గోవిందన్ ను సిట్ అరెస్టు చేసింది. మధ్యప్రదేశ్ లో ఇరవై మంది పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. కారణం విషపూరితమైన దగ్గు సిరప్. ఎంపీ సిట్ బుధవారం రాత్రి విషపూరితమైన దగ్గు సిరప్ " కోల్డ్‌రిఫ్ "ను తయారు చేసే శ్రీసాన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్ గోవిందన్ ను అరెస్టు చేసింది.

Cough syrup row: 20 మంది చిన్నారుల మృతికి కారణం అయిన సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్
Srisan Pharma Owner Ranganathan Govindan Arrest

Updated on: Oct 09, 2025 | 9:15 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్డ్‌రిఫ్ దగ్గు సిరఫ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా 20 మంది మరణించిన కేసులో ప్రధాన చర్యలు తీసుకున్నారు. మధ్య ప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విషపూరిత దగ్గు సిరప్ “కోల్డ్‌రిఫ్” తయారు చేసిన శ్రీసాన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్ గోవిందన్‌ను అరెస్టు చేసింది. బుధవారం రాత్రి అతన్ని పట్టుకున్నారు. అయితే అతనిపై పోలీసులు 20,000 రూపాయల రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే..

నిజాని రంగనాథన్ గోవిందన్ చెన్నైలోని తన ఇంటికి, తమిళనాడులోని కాంచీపురంలోని తన ఫ్యాక్టరీకి తాళం వేసి తన భార్యతో కలిసి పరారీలో ఉన్నాడు. నివేదికల ప్రకారం కోల్డ్‌రిఫ్ అనే విషపూరిత దగ్గు సిరప్ తాగి 20 మంది పిల్లలు మరణించిన తరువాత చింద్వారాలోని పరాసియా పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 5న ఫార్మాస్యూటికల్ కంపెనీ శ్రీసాన్ ఫార్మా డైరెక్టర్లు, పిల్లల వైద్యుడు డాక్టర్ ప్రవీణ్ సోని, ఇతర బాధ్యతాయుతమైన వ్యక్తులపై BNS సెక్షన్లు 105, 276లతో పాటు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 27a కింద కేసు నమోదు చేయబడింది.

పోలీసులు శిశువైద్యుడు డాక్టర్ ప్రవీణ్ సోనిని అరెస్టు చేశారు. అయితే ఇంకా మిగిలిన మందిని అరెస్టు చేయాల్సి ఉంది. ఔషధ కంపెనీ యజమానులను అరెస్టు చేయడానికి చింద్వారా ఎస్పీ అజయ్ పాండే 12 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం సిట్ బృందం రంగనాథన్‌ను చెన్నై నుంచి భోపాల్‌కు తీసుకువెళ్తోంది. అక్కడ దగ్గు సిరప్ తయారీ, ముడి పదార్థాల సరఫరా, పంపిణీ నెట్‌వర్క్ , లైసెన్సింగ్‌కు సంబంధించిన అవకతవకలపై ఆయనను ప్రశ్నించనున్నారు. సిరప్‌లో ప్రాణాంతక రసాయనం ఎలా కలిసింది. కంపెనీ నాణ్యత తనిఖీ విధానాలు ఎందుకు అంత తప్పుగా ఉన్నాయో తెలుసుకోవడానికి దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి.

పిల్లల మరణంతో కలకలం

మధ్యప్రదేశ్‌లో కోల్డ్‌రిఫ్ అనే దగ్గు సిరప్ తాగి ఇరవై మంది పిల్లలు మరణించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. ఆరోగ్య శాఖ వెంటనే ఆ మందు అమ్మకాలను నిషేధించింది, కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంఘటన రాష్ట్రంలో ఔషధాల భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

రంగనాథన్ పట్టుబడిన విధానం ఇది.

రంగనాథన్ అరెస్టు నుంచి తప్పించుకుంటూ అనేక వారాలుగా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతనిపై బహుమతి ప్రకటించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో తమ శోధనను ముమ్మరం చేశారు. ఈ విషయంలో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎలక్ట్రానిక్ నిఘా , స్థానిక వనరులను ఉపయోగించి నిందితుడిని గుర్తించి చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అరెస్టు చేసింది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..