Corona Virus: ఈరోజు దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు. దాదాపు 118 రోజుల తర్వాత 31,443 కేసులు నమోదు

| Edited By: Surya Kala

Jul 13, 2021 | 11:08 AM

Corona Virus : భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు.. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తాళాలు వేసుకున్నాయి. కేసులు అదుపులోకి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే..

Corona Virus: ఈరోజు దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు. దాదాపు 118 రోజుల తర్వాత 31,443 కేసులు నమోదు
India Corona
Follow us on

Corona Virus : భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు.. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తాళాలు వేసుకున్నాయి. కేసులు అదుపులోకి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే చాలా రాష్ట్రాలు అన్ లాక్ చేసుకుంటున్నాయి. దీంతో కరోనా చాలావరకూ తగ్గుముఖం పట్టాయి. దీంతో భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా తగ్గాయి. అయితే మహారాష్ట్రలో మాత్రం థర్డ్ వేవ్ అడుగు పెట్టిందా అనే అనుమానం కలిగిస్తూ.. రోజువారీ భారీ కేసులను నమోదు చేసుకుంది. మంగళవారం భారత్ తన రోజువారీ కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదు చేసింది. దాదాపు 118 రోజుల తర్వాత 35 వేల దిగువకు కేసులు నమోదయ్యాయి.

గడచినా 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 31,443 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09 ,05, 819 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మరణాల లోను గణనీయమైన తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో కొవిడ్ తో 2020మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,10,784 కు చేరుకుంది. గత 24 గంటల్లో  49,007 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలు 3,00,63,730గా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు మహారాష్ట్రలో జూలై మొదటి 11 రోజుల్లో 88,130 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గత రెండు వేవ్ ల ఉధృతితో పోలిస్తే.. ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు మహారాష్ట్రలో జూలైలో నమోదైన కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందని, వివిధ జిల్లాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయని చెప్పారు.

“మళ్ళీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్యల పెరుగుదలను పరిశీలిస్తే (జూలై 2021 లో).. మహారాష్ట్ర, ముంబై లో థర్డ్ వేవ్ రానున్నదని చెప్పడానికి సంకేతమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ముందస్తు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు.

Also Read: ఏ రాశివారికి ఈరోజు ధన, వస్త్ర, వస్తు లాభాలున్నాయి.. ఏయే వస్తువులను దానం చేస్తే విశేష ఫలితాలు పొందుతారంటే