India Covid-19: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. గత 24గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే..?

|

Sep 30, 2021 | 9:51 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో

India Covid-19: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. గత 24గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే..?
India Corona
Follow us on

India Coronavirus Updates: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా 20వేలకు దిగువన నమోదైన కేసులు.. మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 23,529 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా 311 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,39,980 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,48,062 కి చేరింది. నిన్న కరోనా నుంచి 28,718 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,30,14,898 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,77,020 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా.. కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశంలో నమోదైన కరోనా గణాంకాల్లో కేరళలో 12,161 కేసులు నమోదు కాగా.. 155 మంది మరణించారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88,34,70,578 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. గడిచిన 24 గంటల్లో 65,34,306 మందికి కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 15,04,713 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 56,74,50,185 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

IPL 2021 Points Table: టాప్‌లో కొనసాగుతోన్న చెన్నై.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న జట్టు ఏదంటే..?

Crime News: అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించారు.. ఆ తర్వాత ఏమైందంటే..?