India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

|

Oct 14, 2021 | 10:25 AM

India Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా, తాజాగా తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు కారణంగా ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌..

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!
Follow us on

India Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా, తాజాగా తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు కారణంగా ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయాయి. అయితే నిన్నటి కంటే ఈ రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 13,01,083 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా, కొత్తగా 18,987 మందికి పాజిటివ్‌ తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న 19,808 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.40 కోట్ల మందికిపైగా వైరస్‌ సోకగా, వారిలో 3.33 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.7 శాతానికి చేరింది.

ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య 2.06 లక్షలు అంటే 0.61 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక నిన్న కోవిడ్‌తో 246 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,51,435కు చేరింది. బుధవారం 35.66 లక్షల మంది టీకాలు వేసుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 96.82 కోట్ల మందికి టీకాలు అందించారు.

కాగా, నిన్న 15,823 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 226 మంది మృతి చెందారు. అయితే నిన్నటితో పోల్చితే ఈ రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది.

పండగ సీజన్‌లో జాగ్రత్త..

ఇక పండగ సీజన్‌లు వచ్చేయడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా వ్యవహరిస్తే కేసుల సంఖ్య పెరగకుండా ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన విషయం తెలిపిందే. ఇప్పటి వరకు అదుపులో ఉన్న వైరస్‌.. పండగ సీజన్‌ తర్వాత మరింతగా విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కరోనా తగ్గింది కదా అని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Vaccine: ఏయే వ్యాధులకు ఇంకా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు.. ఎంతో మంది మరణిస్తున్నా.. తయారు కానీ టీకాలు!

Covid-19 Vaccine: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా లాభం లేదా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు!