Lockdown in Madhya Pradesh: కరోనా వైరస్ ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్‌లోని మూడు నగరాల్లో లాక్‌డౌన్ విధించిన సర్కార్..

Lockdown in Madhya Pradesh: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, గుజరాత్..

Lockdown in Madhya Pradesh: కరోనా వైరస్ ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్‌లోని మూడు నగరాల్లో లాక్‌డౌన్ విధించిన సర్కార్..
Night Curfew in Telangana

Updated on: Mar 20, 2021 | 1:56 PM

Lockdown in Madhya Pradesh: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, గుజరాత్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి ముందస్తు చర్యలుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాజధాని భోపాల్, ఇండోర్, జబల్పూర్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది. ఈ మూడు నగరాల్లో శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. ఈ నగరాల్లోని స్కూళ్లు, కాలేజీలను మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ క్రమంలో కొన్ని కఠిన నిబంధనలు కూడా విధించారు. మార్చి 20వ తేదీ నుంచి మహారాష్ట్రకు వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మార్కెట్లను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. టీకా లబ్ధిదారుల సంఖ్యను రోజుకు 5 లక్షలకు పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కాగా, మధ్యప్రదేశ్‌లో శుక్రవారం ఒక్క రోజు 1,140 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,73,097 లకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6600 కి పైగా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా కారణంగా రాష్ట్రంలో శుక్రవారం నాడు ఏడుగురు మృత్యువాత పడ్డారు. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,901 మంది మరణించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఇండోర్‌ (309 కేసులు), భోపాల్ (272 కేసులు), జబల్పూర్ (97 కేసులు) చొప్పున ఉన్నాయి. ఈ నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. భౌతిక దూరం పాటించడంతో పాటు.. నిరంతరం మాస్క్ ధరించాలని సూచించింది.

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లైవ్ కింది వీడియోలో చూడొచ్చు..

Also read:

హిందూపురం పట్టణ శివారులో హిజ్రా దారుణ హత్య.. గోంతు కోసి.. డిజీల్ పోసి నిప్పటించారు

Telangana Budget: దేశానికే ఆదర్శంగా టీఎస్ బీ-పాస్‌.. ఆ ఇళ్లకు ఎలాంటి అనుమతి అవసరం లేదు -మంత్రి కేటీఆర్ ‌