Coronavirus Cases India: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 54,044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 76,51,107కు చేరింది. ఇక 24 గంటల్లో 717 కరోనా మరణాలు సంభవించగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 1,15,914కు చేరింది. అలాగే 24 గంటల్లో 61,775 మంది డిశ్చార్జ్ అవ్వగా.. కోలుకున్న వారి సంఖ్య 67,95,103కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7,40,090 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.51 శాతానికి తగ్గడం ఆనందించదగ్గ విషయం. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 88.81 శాతం, యాక్టివ్ కేసుల రేటు(మొత్తం నమోదైన కేసుల్లో) 9.67 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా 24 గంటల్లో 10,83,608 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 9,72,00,379కు చేరింది.
Read More:
అవును మా నాన్న డిఫెన్స్‌లో పనిచేశారు.. కానీ: రూమర్లపై నోయల్ సోదరుడు