Corona Positive: 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు..!

|

Dec 27, 2021 | 6:30 PM

Corona Positive: కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి దేశంలో లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలతో ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒక వైపు కొత్త వేరియంట్‌..

Corona Positive: 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు..!
Follow us on

Corona Positive: కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి దేశంలో లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలతో ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒక వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తుండగా, మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులు అక్కడక్కడ పెరిగిపోతున్నాయి. ఇక మొదటి నుంచి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండగా, ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రంలోని పుణెలో ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది. 25 మంది విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆ సంస్థ అనుబంధంగా ఉన్న ఎంఐటీ వరల్డ్‌ పీస్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రశాంత్ డేవ్ సోమవారం వెల్లడించారు. విద్యార్థులంతా ప్రస్తుతం ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నారని తెలిపారు.

ఇక పాజిటివ్‌ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువగా లక్షణాలు లేనివారు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారని, కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువగా లక్షణాలు లేనివారు..ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రశాంత్ డేవ్ చెప్పారు. కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు. ముందుగా ఒక విద్యార్థికి పాజిటివ్‌ తేలగా, అతనితో కనెక్ట్‌ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించామని, అందులో ఈ 13 మంది విద్యార్థులకు పాజిటివ్‌ తేలినట్లు తెలిపారు. ఇంకా మరో నలుగురి విద్యార్థుల రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

India Covid-19: దేశంలో 578కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. నిన్న కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయంటే?

Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో చైనా వ్యూహం పని చేయదు.. కీలక ట్విట్‌ చేసిన దక్షిణాఫ్రికా వైరాలజిస్ట్‌