Corona Cases In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. అయితే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుండగా.. రికవరీలు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,86,364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 3660 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 23,43,152 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 2,59,459 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 2,48,93,410కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 3,660 మంది వైరస్ కారణంగా మృతి చెందటంతో ఇప్పటిదాకా 3,18,895 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 90.34శాతం ఉండగా.. మరణాల రేటు 1.16శాతం ఉంది. కాగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 20,57,20,660 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
#CoronaVirusUpdates:#COVID19 testing status update:@ICMRDELHI stated that 33,90,39,861 samples tested upto May 27, 2021
20,70,508 samples tested on May 27, 2021#StaySafe #Unite2FightCorona @DBTIndia pic.twitter.com/6hPcuUhzm9
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) May 28, 2021
Also Read:
మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?
టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?
సర్కస్ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!