Honey Trap: లింగాయత్ పీఠాధిపతి ఆత్మహత్యకు హనీట్రాప్ కారణామా..? ఆ కోణంలో కూడా విచారిస్తున్న పోలీసులు..

కర్ణాటకలోని రామనగర జిల్లాలోని కంచుగల్ బండే మఠంలో అక్టోబర్ 24వ తేదీ సోమవారం తన ప్రార్థనా గదిలో పీఠాధిపతి బసవలింగ స్వామి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను పీఠాధిపతి స్థానం నుంచి తొలగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని..

Honey Trap: లింగాయత్ పీఠాధిపతి ఆత్మహత్యకు హనీట్రాప్ కారణామా..? ఆ కోణంలో కూడా విచారిస్తున్న పోలీసులు..
Karnataka Lingayat Seer (File Photo)

Updated on: Oct 26, 2022 | 4:29 PM

కర్ణాటకలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న 45 ఏళ్ల లింగాయత్ పీఠాధిపతి ఆత్మహత్య కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్ ను బట్టి.. పీఠాధిపతి ఆత్మహత్య వెనుక హనీట్రాప్ ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతి బసవలింగ స్వామి ఆత్మహత్య వ్యవహరం కర్ణాటకలో కలకలం రేపింది. సడన్ గా ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆయన చనిపోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ లో ఎన్నో విషయాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒక మహిళ తన వీడియో కాల్స్ తో పీఠాధిపతిని బ్లాక్ మెయిల్ చేసిందని, ఒక మహిళతో పీఠాధిపతి ప్రైవేట్ మూమెంట్స్ ను మరో మహిళ తన ఫోన్ లో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని లింగాయత్ పీఠాధిపతి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారని పోలీసులు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా తెలుస్తోంది. ఒక గుర్తు తెలియని మహిళ పీఠాధిపతిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. లింగాయత్ పీఠాధిపతి ఆత్మహత్య వెనుక హనీట్రాప్ ఉందని పోలీసులు అంటున్నారు.

కర్ణాటకలోని రామనగర జిల్లాలోని కంచుగల్ బండే మఠంలో అక్టోబర్ 24వ తేదీ సోమవారం తన ప్రార్థనా గదిలో పీఠాధిపతి బసవలింగ స్వామి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను పీఠాధిపతి స్థానం నుంచి తొలగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పోలీసులు తెలిపారు. నాలుగు అసభ్యకర వీడియోలను విడుదల చేయడం ద్వారా ఒక మహిళతో పాటు మరి కొందరు పీఠాధిపతిని వేధించారని పోలీసులు తెలిపారు.

లింగాయత్ పీఠాధిపతి బసవలింగ స్వామి ఆత్మహత్య వెనుక మఠంలోని, మఠం వెలుపలి రాజకీయాలు కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కొందరు పీఠాధిపతులకు రాజకీయ నాయకులతో బలమైన పరిచయాలు ఉన్నాయని, వీరు ఇతర పీఠాధిపతులను దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటారని పోలీసులు తెలిపారు. ఈ పీఠాధిపతి ఆత్మహత్య వెనుక రాజకీయ కారణాలు మాత్రం లేవని అన్నారు. ఈ ఆత్మహత్యను అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. కర్ణాటకలోని రామనగర జిల్లాలోని కంచుగల్ బండే మఠం 400 ఏళ్ల క్రితం స్థాపించబడింది. ఆత్మహత్యకు పాల్పడిన పీఠాధిపతి 20 ఏళ్ల వయసులోనే మఠాధిపతిగా బాధ్యతలను స్వీకరించారు. 1997లో బాధ్యతలను స్వీకరించిన ఆయన… ఇటీవలే సిల్వర్ జుబ్లీ వేడుకలు సైతం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

హనీట్రాప్ అంటే ఏమిటి..

పెరుగుతున్న టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొంతమంది హనీట్రాప్ మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బుల కోసం కొంతమంది మహిళలు డబ్బులున్న వ్యక్తులను ఎంచుకుని, వారిని బ్లాక్ మెయిలింగ్ చేయడం హనీట్రాపింగ్ కిందకు వస్తుంది. ఒంటరిగా ఉన్నాను, న్యూ ఫ్రెండ్స్‌ కావాలి, కాల్‌ మీ ఎనీ టైమ్‌.. న్యూడ్‌గా కనిపిస్తా.. అని కవ్వించి.. వలపు వల విసిరి.. హనీ ట్రాప్‌లో చిక్కుకొనేలా చేస్తున్నారు కొంతమంది ఆన్‌లైన్‌ మోసగాళ్లు. టెంప్ట్‌ అయ్యి మాట కలిపారో అంతే సంగతులు. సర్వం దోచేస్తారు. అంతేకాదు పరువు కూడా గంగలో కలిసిపోతుంది .గతంలో వీటిగురించి పెద్ద చర్చ లేదు. ఎక్కడో ఒకటో రెండో జరిగేవి. కాని ఇటీవల కాలంలో హనీ ట్రాప్‌లో పడిపోతున్న వారి సంఖ్య భారీగానే ఉంటుంది. మహిళలు వలపు వలవేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలా మందిని బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఉపయోగం పెరిగిన తర్వాత ఈ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి మోసగాళ్ల బారిన పడిన వారు బయటకు పడేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల చేతిలో మోసాపోయామని చెప్పుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..