కళ్ల కలకతో బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కాలు ట్రై చేయాల్సిందే

దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ ఢిల్లీ ప్రజలను వర్షాలు, వరదలతో పాటు ఓ వ్యాధి కలవరపెడుతోంది. అదే కళ్ల కలక. గత కొన్నిరోజుల నుంచి ప్రతిరోజూ సుమారు వందకిపైగా ఈ కళ్ల కలక కేసులు నమోదవుతున్నాయి.

కళ్ల కలకతో బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కాలు ట్రై చేయాల్సిందే
Conjunctivitis Cases

Updated on: Jul 26, 2023 | 7:51 PM

దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ ఢిల్లీ ప్రజలను వర్షాలు, వరదలతో పాటు ఓ వ్యాధి కలవరపెడుతోంది. అదే కళ్ల కలక. గత కొన్నిరోజుల నుంచి ప్రతిరోజూ సుమారు వందకిపైగా ఈ కళ్ల కలక కేసులు నమోదవుతున్నాయి. కళ్ల కలక అనేది ఓ సీజనల్ వ్యాధి అని.. సీజనల్‌గా వచ్చే్ ఫ్లూ వ్యాధులతో పాటు వైరస్ వల్ల ఇది సోకుతుందని.. ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఆర్‌పీ సెంటర్ ఫర్ ఆప్తాలమిక్ సైన్సెస్ చీఫ్ డాక్టర్ తితియల్ తెలిపారు. గత ఏడాది వర్షకాలంలో నమోదైన కేసులతో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు కేసులు వచ్చాయని పేర్కొన్నారు.

కళ్ల కలక రాకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఫ్లూ లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. ఒకవేళ కళ్ల కలక సోకినట్లైతే నల్లటి కళ్లద్దాలు ధరించాలి. స్విమ్మింగ్ చేయకూడదు. చిన్నపిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని స్కూల్‌కు పంపించకూడదు. అలాగే రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది. కళ్లు ఎరుపెక్కి నీరు రావడం.. రాత్రికి ఊసులతో ముసికొనిపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్లాలి. మరో విషయం ఏంటంటే కళ్ల కలక వస్తే వారం రోజుల తర్వాత తగ్గుతుంది. ఒకవేళ వైరస్‌తో కూడిన కళ్ల కలక వస్తే దాదాపు మూడు వారాల పాటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..