ఓ ‌కాంగ్రెస్‌ నేతకి రూ. 6,100 జరిమానా!

| Edited By:

Dec 29, 2019 | 9:53 PM

ఓ కాంగ్రెస్‌ నేతకి ఫైన్ విధించారు లక్నో ట్రాఫిక్ పోలీసులు. స్కూటర్‌పై హెల్మెట్ లేకుండా తిరిగినందుకు ఆయనకి ట్రాఫిక్ విభాగం రూ.6,100ల జరిమానా విధించింది. మాజీ ఐపీఎస్ అధికారి ఎస్‌ఆర్ దారాపురి కుటుంబ సభ్యులను.. పరామర్శించేందుకు నిన్న ప్రియాంకా గాంధీతో పాటుగా ఆయన స్కూటర్‌పై  వెళ్లారు. కాగా.. శనివారం లక్నోలో ప్రియాంకా గాంధీ పర్యటించారు. ఎన్‌ఆర్సీ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి దారపురిని పోలీసులు అరెస్ట్ చుశారు. ఈ క్రమంలో […]

ఓ ‌కాంగ్రెస్‌ నేతకి రూ. 6,100 జరిమానా!
Follow us on

ఓ కాంగ్రెస్‌ నేతకి ఫైన్ విధించారు లక్నో ట్రాఫిక్ పోలీసులు. స్కూటర్‌పై హెల్మెట్ లేకుండా తిరిగినందుకు ఆయనకి ట్రాఫిక్ విభాగం రూ.6,100ల జరిమానా విధించింది. మాజీ ఐపీఎస్ అధికారి ఎస్‌ఆర్ దారాపురి కుటుంబ సభ్యులను.. పరామర్శించేందుకు నిన్న ప్రియాంకా గాంధీతో పాటుగా ఆయన స్కూటర్‌పై  వెళ్లారు.

కాగా.. శనివారం లక్నోలో ప్రియాంకా గాంధీ పర్యటించారు. ఎన్‌ఆర్సీ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి దారపురిని పోలీసులు అరెస్ట్ చుశారు. ఈ క్రమంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి నిన్న స్కూటీపై ఆమె లక్నో వెళ్లారు. అయితే.. అక్కడ ప్రియాంకా గాంధీకి చేధు అనుభవం ఎదురైంది. ఆమె వారిని పరామర్శిస్తుండగా.. మహిళా పోలీసులు ఆమెను గొంతుపై చేయి వేసి తోసి వేశారు. ఈ చర్యని ప్రియాంకాతో పాటుగా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.