Bharat Jodo Yatra: జోడో యాత్రకు ఏపీలో సూపర్‌ రెస్పాన్స్‌.. రాహుల్‌‌ గాంధీతో కలిసి అడుగులో అడుగేస్తున్న జనాలు..

|

Oct 20, 2022 | 10:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. రాహుల్‌ జోడో యాత్రకు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పాదయాత్రలో రాహుల్‌తో కలిసి..

Bharat Jodo Yatra: జోడో యాత్రకు ఏపీలో సూపర్‌ రెస్పాన్స్‌.. రాహుల్‌‌ గాంధీతో కలిసి అడుగులో అడుగేస్తున్న జనాలు..
Rahul Gandhi
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. రాహుల్‌ జోడో యాత్రకు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పాదయాత్రలో రాహుల్‌తో కలిసి అడుగులో అడుగేస్తున్నారు ప్రజలు. జనం సమస్యల్ని వింటూ, రైతులతో మాట్లాడుతూ నడక సాగిస్తున్నారు రాహుల్‌. ఇవాళ, మొత్తంగా 22 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. మూడోరోజు బోడిబండ దగ్గర నడక ప్రారంభించి, కల్లుదేవకుంట దగ్గర ముగించారు. అనంతరం, మంత్రాలయం ఆలయానికెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు రాహుల్‌గాంధీ.

ఎమ్మిగనూరు సమీపంలో చిలకడోను దగ్గర పత్తి రైతులతో మాట్లాడారు రాహుల్‌గాంధీ. పొలం లోపలికెళ్లి, చెట్టు కింద కూర్చుని, వాళ్ల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విత్తనాలు దొరక్క తీవ్రంగా నష్టపోతున్నామని రాహుల్‌కి తమ గోడు చెప్పుకున్నారు పత్తి రైతులు. అమరావతి రైతుల బాటలోనే రాహుల్‌ని కలిసి తమ గోడు చెప్పుకుంది ఏపీ సర్పంచుల సంఘం. గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందంటూ కంప్లైంట్‌ చేశారు. దాంతో, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు రాహుల్‌.

ఇవి కూడా చదవండి

ఇక, విశాఖ ఉక్కు కార్మికులు జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌తో కలిసి నడిచారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో హోరెత్తించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలంటూ విజ్ఞాపనపత్రం అందించారు. అలాగే, ప్రత్యేక హోదా కోసం రాహుల్‌కి మెమొరాండం ఇచ్చింది చలసాని శ్రీనివాస్‌ అండ్ టీమ్‌. ఇదిలా ఉంటే, రాహుల్‌ జోడో యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చెలరేగింది. CRPF సిబ్బంది, పాదయాత్ర టీమ్‌ మెంబర్స్‌ మధ్య చెలరేగిన చిన్నపాటి గొడవ కొద్దిసేపు టెన్షన్‌ పుట్టించింది.

ఏపీలో మరో రెండ్రోజులపాటు రాహుల్‌ జోడో యాత్ర కొనసాగనుంది. ఆంధ్రాలో 119 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర, మంత్రాలయం మీదుగా తెలంగాణలోకి ప్రవేశించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..