Lakhimpur Kheri violence Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. రైతుల ఫిర్యాదు మేరకు కేంద్రమంత్రి కుమారుడితోపాటు పలువురు వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఘటనా స్థలానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఎస్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, తదితరులను నిర్భందించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎవరూ కూడా అడుగుపెట్టకుండా యోగీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. నిరసన చేపడుతున్న రైతులపై వాహనం దూసుకువెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ నేతలు షేర్ చేసి.. యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎంత వరకు నిజం అన్న దానిపై స్పష్టత లేదు. డ్రైవర్ సీటులో ఎవరు ఉన్నారన్న దానిపై కూడా దీనిలో క్లారిటీ లేదు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ సందేశాన్ని రాశారు.
కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. లఖింపూర్ ఖేరిలో రైతులు ధర్నా చేస్తున్న సమయంలో.. వారి వెనుక నుంచి ఓ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దానికి సంబంధించిన 25 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇవి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింస తాలూకు దృశ్యాలేనని తెలుస్తోంది. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసన చేస్తున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకు రావడం వీడియోలో కనిపిస్తోంది. మిర్జాపుర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత లలితేశ్ పాటి త్రిపాఠి ఈ వీడియోను ట్వీట్ చేశారు. లఖింపుర్ ఖేరి హింసాకాండకు ఇదే రుజువు అని చెప్పారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆ వాహనాన్ని నడిపినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కాగా మంత్రి ఈ ఆరోపణలను ఖండించారు.
వీడియో..
.@narendramodi जी आपकी सरकार ने बग़ैर किसी ऑर्डर और FIR के मुझे पिछले 28 घंटे से हिरासत में रखा है।
अन्नदाता को कुचल देने वाला ये व्यक्ति अब तक गिरफ़्तार नहीं हुआ। क्यों? pic.twitter.com/0IF3iv0Ypi
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 5, 2021