AICC Meeting: పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ఫోకస్.. ఏఐసీసీ భేటీలో కీలక నిర్ణయాలు..

|

Mar 26, 2022 | 6:06 PM

AICC Meeting: కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని అధిష్టానం అడుగులేస్తోంది. దీనిలో భాగంగా కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. శనివారం జరిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జిల భేటీలో

AICC Meeting: పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ఫోకస్.. ఏఐసీసీ భేటీలో కీలక నిర్ణయాలు..
Congress
Follow us on

AICC Meeting: కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని అధిష్టానం అడుగులేస్తోంది. దీనిలో భాగంగా కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. శనివారం జరిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జిల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ధరల పెరుగుదలపై ఫోకస్‌ పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. సామాన్యుడి నడ్డి విరుస్తున్న పెట్రోల్‌, గ్యాస్‌, ఇతర నిత్యావసర ధరలపై వచ్చేనెల దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్‌ పార్టీ. ఢిల్లీలో మూడు గంటలపాటు కొనసాగిన AICC మీటింగ్‌లో పార్టీకి పునర్‌వైభవం తేవడంతోపాటు ఎన్డీయే ప్రభుత్వంలో ధరల పెరుగుదల అంశంపై రాజీలేని పోరాటం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది హస్తంపార్టీ. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో సమూల ప్రక్షాళనపై దృష్టి పెట్టింది AICC. అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న పార్టీని గాడిలో పెట్టేందుకు కసరత్తు చేశారు. పార్టీని బతికించుకోవడంతోపాటు పూర్వవైభవం తెచ్చేలా చర్చించారు. అయితే పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి బదులు ప్రియాంకాగాంధీ హాజరయ్యారు.

రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి పై పలు సూచనలు, అభిప్రాయాలను నాయకులు అధిష్టానికి విన్నవించారు. ఈ భేటీలో సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారం రోజుల పాటు వినూత్న నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు దేశ వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అధిక ధరలకు నిరసనగా ఈ నెల 31న గురువారం ఉదయం 11గంటలకు దేశ ప్రజలంతా తమ ఇంటి ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్‌ సిలిండర్లు ప్రదర్శిస్తూ.. డప్పులు (థాలీ బజావో) కొడుతూ గంటలు మోగించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా కోరారు.

Also Read:

Akhilesh Yadav: యూపీ ప్రతిపక్ష నేత‌గా అఖిలేష్ యాద‌వ్‌.. ఎస్పీ సమావేశంలో కీలక నిర్ణయం..

Yogi Adityanath: రెండో సారి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ తొలి కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..!