ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తననెంతో బాధిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత కూడా అయిన ఈయన.. కేంద్ర నాయకత్వం ఈ ఓటమిపై సీరియస్ గా దృష్టి పెట్టి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మన పార్టీ కార్యకర్తలు వీధుల్లో పోటెత్తాలని, ముఖ్యంగా ట్విటర్, ఫేస్ బుక్ నుంచి బయట పడాలని ఆయన కోరారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ మన పార్టీ గెలుపు ఎక్కడ అని చౌదరి ప్రశ్నించారు. పార్టీలో సంస్కరణలను లోగడ వ్యతిరేకించిన ఈయన ఇప్పుడు అవి అవసరమని అంటున్నారు. పార్టీ పని తీరులో మార్పు రావాలని ఆయన కోరారు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా నేత రాహుల్ గాంధీ రెండు ర్యాలీల్లో మాత్రమే పాల్గొన్నారని, కోవిద్ పరిస్థితి కారణంగా ఆ తరువాత తన ప్రచారాన్ని విరమించుకున్నారని చౌదరి పేర్కొన్నారు. దీంతో పార్టీ కేడర్ లో నైరాశ్యం ఏర్పడిందని, వారి మనోస్థైర్యం దెబ్బ తిన్నదని ఆయన చెప్పారు. బెంగాల్ ఓటర్లకు ఖచ్చితమైన ప్రతిపాదనలు, హామీలు ఇవ్వడంలో పార్టీ నాయకత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్రంలో మమతా బెనర్జీ వైపున మహిళలు, ముస్లిములు ఆమెకు అండగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కేంద్ర నాయకత్వం నుంచి సరైన సపోర్ట్ అందకపోవడమే మన పార్టీ ఓటమికి కారణమని ఆయన చెప్పారు. బెంగాల్ ఎన్నికలకు అధిర్ రంజన్ చౌదరిని పార్టీ-ఇన్-చార్జిగా నియమించిన విషయం గమనార్హం.
లోక్ సభలో పార్టీ నేతగా తనను తొలగించాలని నాయకత్వం భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నానని, వారు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చునని చౌదరి పేర్కొన్నారు. వారికి ఆ స్వేఛ్చ ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. బెంగాల్ లో పార్టీకి పట్టుగొమ్మలైన ముర్షీదాబాద్, మాల్దా జిల్లాల్లో పార్టీ ఓటమిని చౌదరి జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ లేదా తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రభావాన్ని మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నామని ఆయన ప్రశ్నించారు. చిన్న రాష్ట్రమైన అస్సాం లోనూ మనం ఎందుకు వెనుకబడిపోయామని చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకున్నా ఫలితం ఏమైనా కలిగిందా అని ఆయన అన్నారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా మన పార్టీలో కొరవడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.
సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.