‘క్రోనీ జీవీ హై వో’, ‘దేశాన్నే వాళ్లు అమ్మేస్తున్నారు’, ప్రధాని మోదీ వ్యాఖ్యపై రాహుల్ గాంధీ ఫైర్

| Edited By: Anil kumar poka

Feb 10, 2021 | 3:59 PM

రైతుల ఆందోళనపై ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంట్ లో ఉపయోగించిన 'ఆందోళన్ జీవీ' అనే పదంపై ఉవ్వెత్తున విమర్శలు, సెటైర్లు పడుతున్నాయి.

క్రోనీ జీవీ హై  వో,  దేశాన్నే వాళ్లు అమ్మేస్తున్నారు, ప్రధాని మోదీ వ్యాఖ్యపై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi
Follow us on

రైతుల ఆందోళనపై ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంట్ లో ఉపయోగించిన ‘ఆందోళన్ జీవీ’ అనే పదంపై ఉవ్వెత్తున విమర్శలు, సెటైర్లు పడుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  ఇటీవల రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ మోదీ.. ఈ పదాన్ని ప్రస్తావించారు. ఆందోళనల్లో  ‘ఆందోళన్ జీవి’ అనే కొత్త ‘పంట’ పుట్టుకొచ్చిందని, ఈ జీవి కేవలం ఆందోళనలపైనే ఆధారపడుతుందని ఆయన అన్నారు. వీరిపట్ల దేశం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ పరాన్న జీవులు ప్రతి ఆందోళనపైనా ఆధారపడుతుంటాయని పరోక్షంగా విపక్షాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను గుర్తు చేశారు. పీ ఎస్ యూ, పీ ఎస్ బీ సేల్ అనే వర్డ్ ను ఉపయోగించి ఆయన..’క్రోనీ జీవీహై వో’, దేశ్ బేచ్ రహా హై’ అని ట్వీట్ చేశారు. దేశాన్ని అమ్మేసేవారే ఆందోళన్ జీవి అన్నారు. ఇలాగే సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం, ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ వంటివారు కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యపట్ల తప్పు పట్టారు. ఆందోళన ద్వారానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని, ఆందోళన కారణంగానే మనకు ఎన్నో హక్కులు లభించాయని అఖిలేష్ యాదవ్ లోక్ సభలో అన్నారు. ఆందోళనవల్లే మహాత్మా గాంధీ జాతిపిత అయ్యారన్నారు. కాగా… కొత్తరైతు చట్టాలు ఫెడరిజానికి వ్యతిరేకమని, తను ఆందోళన్ జీవి గనుకే దీన్ని ప్రస్తావిస్తున్నానని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇక మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం.. ఆందోళన జీవినైనందుకు తను గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు.

Read More:Unemployment: 2025 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయి.. ప్రకటించిన రాష్ట్ర మంత్రి..

Read More:Rajya Sabha: ది మేజ‌ర్ పోర్ట్ అథారిటీస్ బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం.. ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి మాండవీయ