ప్రధాని మోదీ ప్రయోజనకారా కారా అన్న విషయంముఖ్యం కాదని, ఆయన ఎవరికి ప్రయోజనకారి అన్నది ముఖ్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఇద్దరికి మాత్రం చాలా ‘పనికి వస్తారని’ అంటూ ఈ సందర్భంగా రాహుల్ మళ్ళీ ‘హమ్ దోనో, హమారే దో’ అనే తన ‘స్లోగన్’ ని ప్రస్తావించారు. తమ ఆస్తులు, సంపదను వినియోగించుకోవడానికి ఇద్దరు ఆయనను ఉపయోగించుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలో శనివారం జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన.. క్రోనీ కేపిటలిస్టులకు మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా సాయపడుతున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ఈ ఇద్దరూ నడిపిస్తున్నారని, మరో ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలకు సహాయపడుతున్నారని ఆయన ఇదివరలో కూడా ఆరోపించారు. చైనా అంటే మోదీ భయపడుతున్నారని, లడఖ్ లో ఆక్రమణకు ఆ దేశానికి దోహదపడ్డారని రాహుల్ అన్నారు. 2017 లో అరుణాచల్ ప్రదేశ్ లోని డోక్లామ్ వద్ద ఏం చేశారో, అదే ఇక్కడ కూడా టెస్ట్ చేయాలని ఆ దేశాన్ని కోరారని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
చైనా వారు మన దేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్న విషయం నిజమేనని, మొదట వారు డోక్లామ్ లో పరీక్షించారని, ఆ తరువాత లడాఖ్ పై పడ్డారని ఆయన అన్నారు. అసలు ఇండియాకు ఎవరూ రాలేదని, చొరబాట్లు జరగలేదని మోదీ మొట్టమొదటే వ్యాఖ్యానించి ఆ దేశాన్ని వెనకేసుకొచ్చారని, చైనా అంటే ఆయన భయపడుతారని రాహుల్ పేర్కొన్నారు. తామంటే భారత ప్రధాని భయపడుతున్నారని చైనాకు తెలుసునన్నారు. లడాఖ్ లోని డెప్సాంగ్ ప్రాంతం కీలకమైనదని, ఈ ప్రభుత్వ హయాంలో అది మనకు చైనీయుల అధీనం నుంచి తిరిగి రాదని ఆయన అన్నారు. దీనిపై మొదటినుంచీ చైనా కన్ను వేసిందని, ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అని పేర్కొన్నారు.ఈ ప్రాంతాన్ని ఇండియా కోల్పోవడం ఖాయమన్నారు. ఈ ప్రధాని బలహీనతను చైనా ‘గుర్తించిందని’ రాహుల్ సెటైర్ వేశారు. తమిళనాడులో జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని రాహుల్ తన మూడు రోజుల పర్యటనను తూత్తుకుడిలో ప్రారంభించారు. ఇక్కడి ఓ కాలేజీలో లాయర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
Read More:
Modi with Peacocks: నెమళ్లకు ఆహారం పెడుతున్న ప్రధాని.. గత ఏడాది ఆహ్లాదకరమైన వీడియో మరోసారి మీ కోసం