Rahul Gandhi: “ధరల పెంపు – ఆదాయం తగ్గింపు” మోడల్ ను అమలు చేస్తున్నారు.. ప్రధాని పై రాహుల్ ఫైర్

|

Jun 04, 2022 | 6:10 PM

ప్రధాని నరేంద్ర మోదీపై(PM Modi) కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోక్ కల్యాణ్ మార్గ్ గా ఇంటిపేరును పెట్టకున్నంత మాత్రాన ప్రజలకు సంక్షేమం దక్కదని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈపీఎఫ్...

Rahul Gandhi: ధరల పెంపు - ఆదాయం తగ్గింపు మోడల్ ను అమలు చేస్తున్నారు.. ప్రధాని పై రాహుల్ ఫైర్
Rahul Gandhi
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీపై(PM Modi) కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోక్ కల్యాణ్ మార్గ్ గా ఇంటిపేరును పెట్టకున్నంత మాత్రాన ప్రజలకు సంక్షేమం దక్కదని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈపీఎఫ్(EPF) వడ్డీని 8.1 శాతానికి తగ్గించి, ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు ఆరున్నర కోట్ల మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో ఇబ్బందులు పడతారని ఆవేదన చెందారు. వారి జీవితాలను నాశనం చేసేందుకు ప్రధాని మోదీ.. ‘ధరల పెంపు.. ఆదాయం తగ్గింపు’ మోడల్‌ను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాస చిరునామా పేరే లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌. గతంలో దాన్ని 7 రేస్‌ కోర్స్‌ రోడ్‌గా పిలిచేవారు. 2016లో పేరు మార్చారు. తాజాగా ఇదే పేరును ప్రస్తావిస్తూ రాహుల్‌ తాజాగా ప్రధానిపై విమర్శలు చేశారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. 40 ఏళ్ల కనిష్ట స్థాయి 8.1 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతేడాదిలో 8.5 శాతం ఆదాయాలతో పోలిస్తే ఈ ఏడాది ఈపీఎఫ్ఓ​రూ. 76,768 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. 7.9 శాతం ఆదాయాన్ని పొందింది. మార్చిలో గౌహతిలో జరిగిన ఈపీఎఫ్ఓ​సమావేశం తర్వాత కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో 5 కోట్ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి