Priyanka Gandhi: శాంతియుతంగా నిరసనలు చేయండి.. అగ్నిపథ్ పై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్య

|

Jun 19, 2022 | 9:16 PM

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్(Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువెత్తుతున్నాయి. దేశసేవ చేసుకుంనేందుకు ఆర్మీలో చేరాలనుకుంటే నాలుగేళ్ల సర్వీస్ మాత్రమే...

Priyanka Gandhi: శాంతియుతంగా నిరసనలు చేయండి.. అగ్నిపథ్ పై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్య
Priyanka Gandhi
Follow us on

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్(Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువెత్తుతున్నాయి. దేశసేవ చేసుకుంనేందుకు ఆర్మీలో చేరాలనుకుంటే నాలుగేళ్ల సర్వీస్ మాత్రమే కొనసాగేలా చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో అగ్నిపథ్ నిరసనలపై కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) స్పందించారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని, ఆందోళనలు ఆపొద్దని పిలుపునిచ్చారు. సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకం సైన్యాన్ని అంతం చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగులు తమ నిరసనలు ఆపొద్దని, కానీ శాంతియుతంగా కొనసాగించి ప్రభుత్వాన్ని కూల్చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఆస్తులను రక్షిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీలోని ప్రతి నేత, కార్యకర్త మీ వెంట ఉన్నారని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు.

అభ్యర్థుల వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచడం ఏమిటి..?. 24 గంటలు గడవకముందే బీజేపీ ప్రభుత్వం సైనిక నియామకాల పథకం నిబంధనలను మార్చాల్సి వచ్చింది. ఇది చూస్తుంటే ఈ అగ్నిపథ్‌ నిర్ణయాన్ని హడావుడిగా తీసుకొన్నట్లు తెలుస్తోంది. దీనిని వెంటనే వెనక్కి తీసుకోండి. వైమానిక దళంలో నిలిచిపోయిన నియామక ప్రక్రియ ఫలితాలు వెల్లడించాలి. మునుపటిలా ఆర్మీ నియామకాలను చేపట్టాలి.

      – ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ నేత

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి