ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ

| Edited By:

Jun 10, 2020 | 6:07 PM

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా చెస్ట్ పెయిన్‌ రావడంతో అతడి కుటుంబ సభ్యులు మంగళూరులోని కొడియాల్‌బెల్‌ ఆస్పత్రిలో చేర్చారు.

ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ
Follow us on

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా చెస్ట్ పెయిన్‌ రావడంతో అతడి కుటుంబ సభ్యులు మంగళూరులోని కొడియాల్‌బెల్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. చెస్ట్ పెయిన్‌తో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారని.. ఇతడికి కిడ్నీ సమస్యలతో పాటు, గుండె సంబంధిత సమస్యలు ముందు నుంచే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే రెండు రోజుల క్రితమే రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వెళ్లి వచ్చారని.. బుధవారం నాడు అకస్మాత్తుగా చెస్ట్‌ పెయిన్‌కు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.