Congress Party: అయోధ్య ఆహ్వానంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఆ పార్టీ సీనియర్ నేత ఏమన్నారంటే..!
ఉత్తర్ప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతున్నాయి. తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత పోర్ బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఉత్తర్ప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతున్నాయి. తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత పోర్ బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. శ్రీరాముడు కోట్ల మంది ప్రజల ఆరాధ్యదైవమన్నారు. ఇది దేశ ప్రజలందరి విశ్వాసానికి సంబంధించిన సున్నిత అంశంగా అభివర్ణించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇలాంటి రాజకీయపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో దూరంగా ఉండాలని సూచించారు. అర్జున్ మోద్వాడియా తాజాగా గుజరాత్ పార్టీ బాధ్యతలను స్వీకరించారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు తాము దూరంగా ఉండాలన్ని నిర్ణయించుకున్న కాంగ్రెస్ నిర్ణయాన్ని ట్వీట్ చేస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇదిలా ఉంటే గతంలో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కమిటీ పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ బుధవారం సాయంత్రం సున్నితంగా తిరస్కరించింది. తాము అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడంలేదని స్పష్టం చేసింది. సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖార్గే, లోక్ సభ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి గౌరవపూర్వకంగా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆ పార్టీ నేతల నుంచే ఇలా భిన్నాభిప్రాయాలు రావడం చర్చనీయాంశంగా మారింది.
भगवान श्री राम आराध्य देव हैं।
यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..