
కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోని గురువారం (ఏప్రిల్ 6) బిజెపిలో చేరారు. కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ మాజీ కన్వీనర్ అనిల్ ఆంటోనీ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, వీ.మురళీధరన్, కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనిల్ ఆంటోనీ మాట్లాడుతూ, ఒక భారతీయ యువకుడిగా, దేశ నిర్మాణం, జాతీయ సమైక్యత గురించి ప్రధానమంత్రితో సహకరించడం నా బాధ్యత, కర్తవ్యంగా నేను భావిస్తున్నాను అని అన్నారు.
ఏకే ఆంటోనీ కేంద్ర మంత్రిగా, సీఎంగా కూడా ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం నేపథ్యంలో అనిల్ ఆంటోనీ జనవరిలో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. అనిల్ ఆంటోనీ తండ్రి ఏకే ఆంటోనీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేశారు. అంతే కాకుండా కేరళ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. పెద్ద నాయకుల్లో ఏకే ఆంటోనీ కూడా ఒకరు.
పార్టీని వీడే ముందు అనిల్ ఆంటోనీ కేరళలో కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌ను నడిపేవారు. బిబిసి డాక్యుమెంటరీని భారతదేశానికి వ్యతిరేకంగా పక్షపాతంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ప్రకటించారు. అనిల్ ఆంటోనీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని బీజేపీ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
#WATCH | Congress leader & former Defence minister AK Antony’s son, Anil Antony joins BJP in Delhi pic.twitter.com/qJYBe40xuY
— ANI (@ANI) April 6, 2023
అనిల్ అంటోనీకి ఆయన కండువా కప్పి బీజేపీలోకి స్వాగతించారు. అనిల్ ఆంటోని క్రెడిషియల్స్ చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆయన అభిప్రాయాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని పోలి ఉన్నాయన్నారు. అతను చాలా చురుకైన పాత్రను కొనసాగిస్తారని, దక్షిణ భారతదేశంలో బిజెపిని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వసం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం