AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: కాంగ్రెస్‌ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడు..

కేరళలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్రమంత్రి , కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని కుమారుడు అనిల్‌ ఆంటోని బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయెల్‌ , మురళీధరన్‌ సమక్షంలో బీజేపీలో చేరారు అనిల్‌ ఆంటోని. గత కొంతకాలంగా రాహుల్‌గాంధీ తీరుపై విమర్శలు చేస్తున్న అనిల్‌ ఆంటోని బీజేపీ వైపు మొగ్గారు.

BJP: కాంగ్రెస్‌ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడు..
Anil Antony
Sanjay Kasula
|

Updated on: Apr 06, 2023 | 4:15 PM

Share

కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోని గురువారం (ఏప్రిల్ 6) బిజెపిలో చేరారు. కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ మాజీ కన్వీనర్ అనిల్ ఆంటోనీ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, వీ.మురళీధరన్, కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనిల్ ఆంటోనీ మాట్లాడుతూ, ఒక భారతీయ యువకుడిగా, దేశ నిర్మాణం, జాతీయ సమైక్యత గురించి ప్రధానమంత్రితో  సహకరించడం నా బాధ్యత, కర్తవ్యంగా నేను భావిస్తున్నాను అని అన్నారు.

ఏకే ఆంటోనీ కేంద్ర మంత్రిగా, సీఎంగా కూడా ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం నేపథ్యంలో అనిల్ ఆంటోనీ జనవరిలో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. అనిల్ ఆంటోనీ తండ్రి ఏకే ఆంటోనీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేశారు. అంతే కాకుండా కేరళ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. పెద్ద నాయకుల్లో ఏకే ఆంటోనీ  కూడా ఒకరు.

అనిల్ ఆంటోనీకి పీయూష్ గోయల్ స్వాగతం

పార్టీని వీడే ముందు అనిల్ ఆంటోనీ కేరళలో కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌ను నడిపేవారు. బిబిసి డాక్యుమెంటరీని భారతదేశానికి వ్యతిరేకంగా పక్షపాతంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ప్రకటించారు. అనిల్ ఆంటోనీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని బీజేపీ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

వీడియోను ఇక్కడ చూడండి..

అనిల్ అంటోనీకి ఆయన కండువా కప్పి బీజేపీలోకి స్వాగతించారు. అనిల్ ఆంటోని క్రెడిషియల్స్ చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆయన అభిప్రాయాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని పోలి ఉన్నాయన్నారు. అతను చాలా చురుకైన పాత్రను కొనసాగిస్తారని,  దక్షిణ భారతదేశంలో బిజెపిని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వసం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో