ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండించిన కాంగ్రెస్.. ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం

| Edited By:

Aug 12, 2020 | 3:42 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘర్ఫణలో ఎమ్మెల్యే ఇంటి..

ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండించిన కాంగ్రెస్.. ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం
Follow us on

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘర్ఫణలో ఎమ్మెల్యే ఇంటి సమీపంలోని పలు వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కారణంగా.. ఈ వివాదం చోటుచేసుకుంది. అయితే పోస్ట్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేకు బంధువంటూ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. అటు అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులపై కూడా దాడికి దిగారు.

ఈ ఘటనలో దాదాపు అరవై మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితి అదుపుతప్పుతుండటంతో.. ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే వందమందికి పైగా అరెస్ట్ చేశారు. ఘటనపై అటు ప్రభుత్వం కూడా సీరియస్‌ అయ్యింది. ఇది పక్కా ప్లాన్‌ ప్రకారం చేసిన దాడి అంటూ అధికార పార్టీ నేతలు కూడా వాపోయారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఘటనపై ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతుగా నిలుస్తామని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎల్పీ నాయకుడు సిద్ధి రామయ్యతో ఈ విషయంపై శివకుమార్ మాట్లాడారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే