ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన‌ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

స‌ర్ గంగారాం ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. జులై 30వ తేదీన హెల్త్ చెక‌ప్‌ల‌ కోసం ఆస్ప‌త్రిలో చేరారు సోనియా గాంధీ. ప్ర‌స్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని గంగారం ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. కాగా జులై 30న‌ సోనియా గాంధీ..

  • Updated On - 1:53 pm, Sun, 2 August 20 Edited By:
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన‌ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

స‌ర్ గంగారాం ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. జులై 30వ తేదీన హెల్త్ చెక‌ప్‌ల‌ కోసం ఆస్ప‌త్రిలో చేరారు సోనియా గాంధీ. ప్ర‌స్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని గంగారం ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. కాగా జులై 30న‌ సోనియా గాంధీ గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆమె అడ్మిట్ అయ్యారు. రెస్పిరేటరీ మెడిసిన్ నిపుణుడైన డాక్టర్ అరూప్ కుమార్ బసు పర్యవేక్షణలో ఆమెకు పరీక్షలు నిర్వ‌హించారు. ఫిబ్రవరి నెలలో సోనియా గాంధీ కడుపు నొప్పితో బాధపడుతూ ఇదే హాస్పిట‌ల్‌లో చేరిన విష‌యం తెలిసిందే.

Read More:

‘క్యాస్టింగ్ కౌచ్’‌పై న‌టి ప్ర‌గ‌తి సంచ‌ల‌న కామెంట్స్..

సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

 ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!