Rhea Chakraborthy Father: బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడగా దర్యాప్తు చేసిన ఎన్సీబీ అధికారులు నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్తవర్తి, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిందా, సుశాంత్ కుక్(వంట మనిషి) దీపేష్ శావంత్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో రియా పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, త్వరలోనే ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తన కుమారుడిని అరెస్ట్ చేయడంపై రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి స్పందించారు.
”కంగ్రాట్స్ ఇండియా. మా కుమారుడిని అరెస్ట్ చేశారు. నెక్ట్స్ నా కూతురు లైన్‌లో ఉందని అర్థమవుతోంది. మధ్యతరగతి కుటుంబాన్ని నాశనం చేశారు. న్యాయం కోసం అందరికీ న్యాయం జరుగుతోంది. జైహింద్” అని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే ఈ ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అవును మీది చాలా మధ్య తరగతి కుటుంబం. అందుకే చాలా ఖరీదైన లాయర్‌ని పెట్టుకున్నారు. మధ్యతరగతి వారు డ్రగ్స్ కేసులో ఎప్పుడూ అరెస్ట్ అవ్వరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని మీరు చంపారు. ఆ వ్యక్తి తండ్రి ఎలాంటి మానసిక స్థితిని అనుభవిస్తున్నాడో తెలుసుకోండి. భారతదేశం మీ పిల్లలను అరెస్ట్ చేయలేదు. వారు చేసిన డ్రగ్స్ వ్యాపారమే వారిని అరెస్ట్ చేయించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read More: