మమతా బెనర్జీపై దాడి, ఖండనలు, సానుభూతి కోసమే ‘డ్రామా’ అంటూ సెటైరికల్ ట్వీట్లు

| Edited By: Anil kumar poka

Mar 11, 2021 | 9:59 AM

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడిని పలువురు నేతలు ఖండించగా అదే సమయంలో ప్రజల సానుభూతిని పొందేందుకు ఇదంతా  ఆమె ఆడిన డ్రామా అంటూ సెటైరికల్ ట్వీట్లు మొదలయ్యాయి.

మమతా బెనర్జీపై దాడి, ఖండనలు,  సానుభూతి కోసమే డ్రామా అంటూ సెటైరికల్ ట్వీట్లు
Follow us on

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడిని పలువురు నేతలు ఖండించగా అదే సమయంలో ప్రజల సానుభూతిని పొందేందుకు ఇదంతా  ఆమె ఆడిన డ్రామా అంటూ సెటైరికల్ ట్వీట్లు మొదలయ్యాయి.ఈ ఎటాక్ ను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఖండిస్తూ…ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేనివారెవరైనా ఎంతకైనా తెగిస్తారని ఈ ఘటనతో నిరూపితమైందని అన్నారు. కొందరు గూండాలు చేసిన ఈ  దాడి పిరికిపంద చర్య అన్నారు. బీజేపీ అండ గల  ఈసీ  అదుపులో బెంగాల్ పోలీసులు ఉన్నారని ఆయనపేర్కొన్నారు. టీఎంసి  నేత, మమత మేనల్లుడు అభిజిత్ ముఖర్జీ…. దీదీ సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఎటాక్ ను హేయమైన, పిరికిపందల చర్యగా ఆయన కూడా అభివర్ణించారు. ఈ దాడి వెనుక ఎవరున్నా సరే..వారిని వదలరాదన్నారు. మీరు తప్పకుండా విజయవంతంగా కోలుకుని బయటకు వస్తారని ఆ నమ్మకం తనకుందన్నారు.

ఈ  దాడికి కారకులైనవారిని వెంటనే అరెస్ట్ చేయాలనీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ విధమైన దాడులు సహేతుకం కాదన్నారు.  మమత  త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇక లోక్ సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, బెంగాల్ బీజేపీ నేతలు కైలాష్ వైజాయ్ వర్గీయ, అర్జున్ సింగ్ తదితరులు ఇదంతా సానుభూతి కోసం మమత ఆడిన నాటకమని ఆరోపించారు. ఆమె చుట్టూ అనేకమంది పోలీసులు, భద్రతా బలగాలు ఉంటాయని, ఎవరైనా ఒక ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి..కారులో ఆమెను తోసేసి గాయపరచగలరా అని వారు ప్రశ్నించారు .దాడికి పాల్పడిన వారు ఎక్కడి నుంచో రారని, ఒకవేళ నిజంగా ఈ దాడి జరిగి ఉంటే బాధ్యతలేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలనీ విజయ్ వర్గీయ అన్నారు. కుట్ర చేసి ఓ చిన్న యాక్సిడెంటును పెద్దగా చేసి చూపడానికి ప్రయత్నిస్తున్నారని, అసలు దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు . నందిగ్రామ్ లో నిన్న సాయంత్రం తన కారు వద్దకు వెళ్ళబోతున్న మమతా బెనర్జీపై ఎటాక్ జరిగిన సంగతి తెలిసిందే.



మరిన్ని చదవండి ఇక్కడ :

Mamata Banerjee Injured: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి.. గాయాలు.. నందిగ్రామ్‌లో ఉద్రిక్తత

సచిన్ టెండూల్కర్ ప్రాంక్.. హడలిపోయిన డాక్టర్.. వైరల్ గా మారిన వీడియో : Sachin Tendulkar Pranks On Doctor Video.

ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే వార్త..ఇండియాలో భారీగా తగ్గిన ఆపిల్ ఫోన్ ధరలు..!:Iphone Price In India Video