Viral: వామ్మో.. వాయమ్మో.. మా తల్లే.. గౌను గుండీల వెనుక ఇంత గూడుపుఠాణి ఉందా

|

May 21, 2022 | 3:33 PM

రోజుకో వెరైటీ టెక్నిక్.. ఇలాంటివి బాగు పడటానికి ఎందుకు ఉపయోగించరో అర్థం కాదు. ఇలాంటి సూపర్ ఐడియాస్ మంచి పనుల కోసం వాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి కదా..!

Viral: వామ్మో.. వాయమ్మో.. మా తల్లే.. గౌను గుండీల వెనుక ఇంత గూడుపుఠాణి ఉందా
representative image
Follow us on

నిజంగా డ్రగ్స్‌కి మన దేశంలో యువత ఇంతలా బానిసలయ్యారా అనిపిస్తుంది.. స్మగ్లర్లు పడుతున్న కథలు చూస్తుంటే.  సీఎం కేసీఆర్(CM Kcr) పదే, పదే నొక్కి చెబుతున్నట్లు డ్రగ్స్‌(Drugs)పై ఉక్కుపాదం మోపకపోతే.. యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో అధికారులు రైడ్స్ పెంచారు. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాలకు చెక్ పెడుతున్నారు. డ్రగ్ పెడ్లర్స్, స్మగ్లర్స్ చాలామంది దొరికిపోతున్నారు. అయితే కొందరు డ్రగ్స్ స్మగ్లింగ్‌లో క్రియేటివ్ బ్రెయిన్ ఉపయోగిస్తున్నారు. పుష్ప సినిమాలో హీరో మాదిరి.. కొత్త ఐడియాలతో.. పోలీసులను, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(Narcotics Control Bureau) అధికారులను విస్మయానికి గురిచేస్తున్నారు. తాజాగా ఇథియోపియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ నుంచి దాదాపు రూ. 25 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆమెకే ఈ ఐడియా వచ్చిందో.. మరి ఎవరైనా చెప్పారేమో తెలియదు కానీ..  30 గౌన్ల బటన్లలో చాకచక్యంగా కొకైన్ దాచి.. తీసుకొచ్చింది. అయితే అధికారులు.. నిఘా పెట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు నైజీరియా దేశస్థురాలిగా చెబుతున్నారు. గౌనులను పరిశీలించిన అనంతరం కస్టమ్స్‌ విభాగం అధికారలు దుస్తుల్లోని డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితురాలు.. దోహా మీదుగా ఫ్లైట్‌లో వచ్చి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3లో దిగింది. స్వాధీనం చేసుకున్న కొకైన్ బరువు 1.7 కిలోలని అధికారులు తెలిపారు. అదే విధంగా ఉగాండాకు చెందిన ఓ వ్యక్తి రూ.6 కోట్ల హెరాయిన్‌తో పట్టుబడ్డాడు. నిందితుడు హెరాయిన్‌ క్యాప్సూల్స్‌ను కడుపులో దాచుకుని వచ్చాడు. అతడిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. తరువాత, ఆపరేషన్ చేసి కడుపులోని క్యాప్సూల్స్ బయటకు తీశారు డాక్టర్స్. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి