దేశంలో విపరీతంగా పెరిగిపోయిన పెట్రోలు, డీజిల్ ధరలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాధ్రా..ప్రధాని మోదీకి ‘ సవాల్’ విసిరారు. ఏసీ కార్లనుంచి బయటకు రావాలని, ఈ దేశ ప్రజలు ఎలా బాధ పడుతున్నారో చూడాలని అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీ లోని ఖాన్ మార్కెట్ నుంచి తన కార్యాలయానికి ఇద్దరు సహచరులతో బాటు సైకిల్ తొక్కుతూ ప్రయాణించారు. మీరు మీ ఖరీదైన కార్ల నుంచి బయటికి వచ్చి .. ప్రజల బాధలు చూస్తేనైనా బహుశా పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలనుకుంటారేమో అన్నారు. సూటు, హెల్మెట్ ధరించి ఆయన సైకిల్ తొక్కుతున్న ఫోటోలను వివిధ సంస్థలు ప్రచురించాయి.
అటు-రాబర్ట్ వాధ్రా బావ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పెట్రోల్ పంప్ వద్ద మీ కారులో ఇంధనం నింపుకుంటున్నప్పుడు వేగంగా తిరుగుతున్న మీటర్ ను చూసినప్పుడైనా అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గాయన్న విషయం మీకు తెలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. 100 రూపాయలకు లీటర్ పెట్రోల్ ! మోదీ ప్రభుత్వం మీ (ప్రజల) జేబులు ఖాళీ చేస్తూ ఆయన మిత్రుల జేబులు నింపుతోందని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో ఇటీవల పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గత వారం రాజస్థాన్ లో పెట్రోలు లీటర్ 100 రూపాయలు మించిపోయింది.
మరిన్ని చదవండి ఇక్కడ :
అందంగా ఉందని యువతిని ఉద్యోగం నుంచి తొలగింపు : women dismissed from job due to her beauty video
రెండో పెళ్ళికి రెడీ అవుతున్న సురేఖా వాణి..మరోసారి ఏడడుగులు వేయడం పై సురేఖ వాణి
దుబాయ్ పోలీస్ స్టేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు : Mahesh Babu in Dubai Smart police Station Video