Kolkata: ఆందోళన చేస్తున్న డాక్టర్ల దగ్గరకు వచ్చిన బెంగాల్ సీఎం మమత
ఆందోళన చేస్తున్న డాక్టర్ల దగ్గరకు వచ్చారు బెంగాల్ సీఎం మమత. వి వాంట్ జస్టిస్ అంటూ సీఎంకు స్వాగతం పలికారు డాక్టర్లు. సీఎంగా రాలేదు దీదీగా వచ్చానని వారికి తెలిపారు మమత. ఐదు నిమిషాలు వారితో మాట్లాడి వెళ్లిపోయారు.
దాదాపు 35 రోజులుగా ఆందోళన చేస్తున్న డాక్టర్లపై తమ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కోల్‌కతా స్వాస్థ భవన్ ఎదుట నిరసన తెలుపుతున్న డాక్టర్ల దగ్గరకు మమతా బెనర్జీ వచ్చారు. ముఖ్యమంత్రిగా మాట్లాడేందుకు రాలేదని, దీదీగా వచ్చాని అన్నారు. మమతా బెనర్జీ మాట్లాడుతున్న సమయంలో డాక్టర్లు – వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. నిరసనలు విరమించి విధుల్లో చేరాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టులో విచారణ ఉందని డాక్టర్లకు గుర్తు చేశారు. దోషలు తన స్నేహితులు కాదు, శత్రువులు కాదని మమతా బెనర్జీ తెలిపారు. తాను వారిపై చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. యూపీ పోలీసుల తరహాలో తాను డాక్టర్లపై ఎస్మా ప్రయోగించనని అన్నారు. ఉద్యమాల నుంచి తాను వచ్చానని మమతా గుర్తు చేశారు. రాత్రంతా డాక్టర్లు వర్షంలో తడుస్తూ ఉన్నారని తెలిశాక తాను నిద్రపోలేదని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
మరో వైపు రోగుల సంక్షేమ కమిటీలను రద్దు చేస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆందోళన చేస్తున్న డాక్టర్లు తెలిపారు. కాని తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. తమ డిమాండ్లను సీఎం అంగీకరించాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి