Bank Siren Rings: అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?

Bank Siren Rings: అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Sep 14, 2024 | 5:03 PM

సమయం అర్థరాత్రి ఒంటి గంట.. నగరం గాఢ నిద్రలోకి జారుకున్న వేళ​.. హఠాత్తుగా బ్యాంక్‌ సైరన్‌ పెద్దగా మోగింది... స్థానికులు ఉలిక్కిపడి లేచారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు అలర్టయ్యారు. బ్యాంకులోకి దొంగలెవరో ప్రవేశించారని అనుకున్నారు. అయితే వారు బ్యాంకు దగ్గరకు చేరుకుని అ‍క్కడ జరిగినదేంటో తెలుసుకుని నవ్వాలో ఏడవాలో తెలియక తెల్లముఖం వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది.

సమయం అర్థరాత్రి ఒంటి గంట.. నగరం గాఢ నిద్రలోకి జారుకున్న వేళ​.. హఠాత్తుగా బ్యాంక్‌ సైరన్‌ పెద్దగా మోగింది… స్థానికులు ఉలిక్కిపడి లేచారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు అలర్టయ్యారు. బ్యాంకులోకి దొంగలెవరో ప్రవేశించారని అనుకున్నారు. అయితే వారు బ్యాంకు దగ్గరకు చేరుకుని అ‍క్కడ జరిగినదేంటో తెలుసుకుని నవ్వాలో ఏడవాలో తెలియక తెల్లముఖం వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం షాహాబాద్‌లోని హర్దోయ్‌లో రాత్రి ఒంటి గంటకు అకస్మాత్తుగా బ్యాంక్ సైరన్ మోగింది. అప్రమత్తమైన స్థానిక పోలీసులు బ్యాంకు దగ్గరకు చేరుకున్నారు. బ్యాంకు క్యాషియర్‌ను పిలిపించి, లోపల తనిఖీలు చేశారు. గంటల తరబడి వెదికినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.

అయితే ఎలుకలు సైరన్ వైరును కొరికినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అందుకే ఎమర్జెన్సీ సైరన్‌ మోగిందని తెలుసుకున్నారు. ఊహించిన విధంగా ఏమీ జరగకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చకున్నారు. షహబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్దనున్న ఆర్యవర్ట్ గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన జరిగింది. బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో బ్యాంకులోని ఎమర్జెన్సీ అలారం ఒక్కసారిగా మోగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై బ్యాంకు చుట్టుపక్కల దొంగలెవరైనా ఉన్నారేమోనని తనిఖీలు కూడా చేశారు. అయితే ఎలుకల కారణంగా సైరన్‌ మోగిందని తెలుసుకుని నవ్వుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.