AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిల్లర ‘దొంగలు’.. రూ.11 కోట్లు మాయం.. రంగంలోకి దిగిన CBI

నోట్ల కట్టలో తేడాలుంటే వెంటనే పట్టుకోవచ్చు.. అదే చిల్లరలో తేడాను త్వరగా పట్టుకోలేం.. వందో.. రెండొందలో అంటే చిల్లర లెక్కపెట్టొచ్చు.. కాని కోట్ల రూపాయల చిల్లరను ఎలా లెక్కపెడతాం.. చేతితోనే లెక్కపెట్టాలి. దీన్ని అదునుగా చేసుకున్న కొంతమంది..

చిల్లర 'దొంగలు'.. రూ.11 కోట్లు మాయం.. రంగంలోకి దిగిన CBI
Cbi
Amarnadh Daneti
|

Updated on: Aug 19, 2022 | 7:41 AM

Share

నోట్ల కట్టలో తేడాలుంటే వెంటనే పట్టుకోవచ్చు.. అదే చిల్లరలో తేడాను త్వరగా పట్టుకోలేం.. వందో.. రెండొందలో అంటే చిల్లర లెక్కపెట్టొచ్చు.. కాని కోట్ల రూపాయల చిల్లరను ఎలా లెక్కపెడతాం.. చేతితోనే లెక్కపెట్టాలి. దీన్ని అదునుగా చేసుకున్న కొంతమంది ఏకంగా రూ.11కోట్ల చిల్లర నాణేలను మాయం చేశారు. స్థానిక పోలీసుల విచారణకు అవాంతరాలు ఏర్పడుతుంటంతో SBI విజ్ఞప్తితో రాజస్థాన్ హైకోర్టు ఈకేసు విచారణను CBIకి అప్పగించడంతో.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు.

నాణేల మాయంలో అసలు లెక్క తేల్చేందుకు CBI అధికారులు గురువారం దేశ వ్యాప్తంగా 25చోట్ల సోదాలు నిర్వహించింది. ఢిల్లీతో పాటు, జైపూర్, దౌసా, కరౌలి, సవాయి మధోపూర్, అల్వార్, ఉదయ్ పూర్, భిల్వారాలో 15 మంది మాజీ బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. గత ఏడాది ఆగష్టులో రాజస్థాన్ లోని కరౌలి జిల్లా మెహందీపూర్ బాలాజీ SBI బ్రాంచిలో నగదు నిల్వలో తేడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో అధికారులు లెక్కింపు చేపట్టారు. మొత్తం నాణేల నిల్వ రూ.13కోట్లుగా అకౌంట్ పుస్తకాల్లో చూపించారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు చిల్లర లెక్కింపు బాధ్యతలను ఓ ప్రయివేటు సంస్థకు అప్పగించారు. బ్రాంచ్ మేనేజర్ సమక్షంలో జరిగిన లెక్కింపులో రూ.2 కోట్లు విలువైన నాణేలే ఉన్నాయని తేలింది. దీంతో SBI అధికారులు విస్తుపోయారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో జాప్యం జరుగుతుండటంతో SBI అధికారులు ఈకేసును CBIకి అప్పగించాలని రాజస్థాన్ హైకోర్టును కోరారు. స్పందించిన కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో అసలు చిల్లర దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు CBI అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..