BRS Party Office Inauguration Highlights: ‘ఎర్రకోట’లో గులాబీ గుబాళింపు.. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..

|

Dec 14, 2022 | 1:27 PM

తెలుగు నేలపై పుట్టి.. తెలంగాణ గడ్డపై సర్వశక్తులూ ఒడ్డి, పార్టీని బలోపేతం చేసుకున్న టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా అవతరించి, ఇప్పుడు హస్తినలో అడుగుమోపబోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యజ్ఞయాగాలతో సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారు.

BRS Party Office Inauguration Highlights: ‘ఎర్రకోట’లో గులాబీ గుబాళింపు.. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..
Cm Kcr

తెలుగు నేలపై పుట్టి.. తెలంగాణ గడ్డపై సర్వశక్తులూ ఒడ్డి, పార్టీని బలోపేతం చేసుకున్న టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా అవతరించి, ఇప్పుడు హస్తినలో అడుగుమోపబోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యజ్ఞయాగాలతో సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారు. వేదపండితులు నిర్ణయించిన దివ్యముహూర్తం ప్రకారం ఢిల్లీలో హోమాలు.. యజ్ఞయాగాలతో బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. సరిగ్గా 12గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల మధ్య జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆఫీస్‌ను ప్రారంభించి.. తన గదిలో కూర్చుంటారు CM కేసీఆర్. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పంజాబ్, హ‌ర్యానా, యూపీ, ఒడిశా, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన రైతు నేతలు తరలివచ్చారు. కర్నాటక మాజీ CM కుమార‌స్వామి, UP మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతలు, తెలంగాణ మంత్రులు, పలువురు కీలక నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Dec 2022 12:59 PM (IST)

    ఢిల్లీలో గులాబీ సందడి..

    బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ కు పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్ .. సక్సెస్ కావాలంటూ ఆకాంక్షించారు.

  • 14 Dec 2022 12:45 PM (IST)

    సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పిన నేతలు..

    బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్.. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి.. తన ఛాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, జేడీఎస్ కుమారస్వామి.. కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం కూడా చేశారు.


  • 14 Dec 2022 12:41 PM (IST)

    బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..

    బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.

  • 14 Dec 2022 12:39 PM (IST)

    బీఆర్ఎస్ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్..

    ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు.

  • 14 Dec 2022 12:27 PM (IST)

    తరలివచ్చిన పలు రాష్ట్రాల రైతు నేతలు..

    బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు, మాజీ ఎంపీలు సైతం హాజరయ్యారు.

  • 14 Dec 2022 12:24 PM (IST)

    ఢిల్లీకి భారీగా చేరుకున్న నేతలు..

    ఢిల్లీలో BRS పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేల సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది.

  • 14 Dec 2022 12:21 PM (IST)

    దివ్యముహూర్తంలో..

    పూజా కార్యక్రమాల అనంతరం సీఎం కేసీఆర్.. దివ్యముహూర్తంలో పార్టీ జెండాను ఎగురవేసి.. కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

  • 14 Dec 2022 12:19 PM (IST)

    పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు..

    ఢిల్లీలో BRS పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. పూజా కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ దంపతులు, మాజీ సీఎంలు అఖిలేష్‌, కుమారస్వామి, ఎమ్మెల్సీ కవిత పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • 14 Dec 2022 12:16 PM (IST)

    బీఆర్ఎస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు.. మంత్రి కేటీఆర్‌

    ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్.. దేశంలో ఒక గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారంటూ తెలిపారు.

  • 14 Dec 2022 12:12 PM (IST)

    హాజరు కాలేకపోతున్నా.. మంత్రి కేటీఆర్

    ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్.. దేశంలో ఒక గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఆనాడు ఎలాగైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించారో.. అలాగే ఈనాడు దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర రావు ప్రత్యేక అనుమతితో ఢిల్లీలోని బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నాను. ముందే నిర్ణయించిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసున్నానని కేటీఆర్ తెలిపారు.

    సిరిసిల్లలో సెస్ ఎన్నికల నామినేషన్లు కూడా ఈ రోజే ఉన్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బీఆర్ఎస్ వేదికగా దేశం మొత్తానికి పరిచయం అవుతాయి. దేశంలో రాబోయే గుణాత్మక మార్పునకు ఈనాటి బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం నాంది కానుందని కేటీఆర్ తెలిపారు.

  • 14 Dec 2022 12:08 PM (IST)

    కేసీఆర్ వెంట.. మాజీ సీఎంలు అఖిలేష్, కుమారస్వామి

    ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేసిఆర్ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చేరుకున్నారు.

  • 14 Dec 2022 12:06 PM (IST)

    బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి చేరుకున్న కేసీఆర్..

    బీఆరెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు..

Follow us on