CM KCR: ‘ఎర్రకోట’లో గులాబీ పార్టీ సందడి.. BRS కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..

|

Dec 14, 2022 | 12:56 PM

బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్.. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి.. తన ఛాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, జేడీఎస్ కుమారస్వామి.. కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR: ‘ఎర్రకోట’లో గులాబీ పార్టీ సందడి.. BRS కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us on

వేద పండితులు పెట్టిన దివ్య ముహూర్తం ప్రకారం.. సరిగ్గా 12గంటల 37 నిమిషాలకు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత వేద మంత్రాల మధ్య.. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తన ఛాంబర్‌లో కూర్చున్నారు సీఎం కేసీఆర్. అంతకు ముందు యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు యాగంలో పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి కర్నాటక మాజీ CM కుమార‌స్వామి, UP మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌తో పాటు పంజాబ్, హ‌ర్యానా, యూపీ, ఒడిశా, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన రైతు నేతలు ఈ వేడుకల్లో భాగమయ్యారు.

పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్.. పార్టీ ఫైల్ పై సంతకం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, జేడీఎస్ కుమారస్వామి.. కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ కోసం ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో సొంత భవనం నిర్మిస్తున్నారు. మరో ఐదారు నెలల్లో ఇది సిద్ధమవుతుంది. అప్పటి వరకూ ఈ తాత్కాలిక కార్యాలయం నుంచి కార్యకలాపాలు కొనసాగుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..