తెలంగాణ సీఎం కేసీఆర్.. నేషనల్ పొలిటికల్ ఫోకస్ మొదలయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి చండీగఢ్ చేరుకున్నారు సీఎం కేసీఆర్. అయితే చండీగఢ్‌లో రైతు కుటుంబాలను రెండు రాష్ట్రాల సీఎంలు పరామర్శిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం విందుభేటీలో పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు బయలుదేరారు. సాగుచట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను సీఎంలు పరామర్శించారు. ఈ సందర్భంగా చండీగఢ్‌లో రైతులు, సైనికుల కుటుంబాలకు చెక్కులను అందించనున్నారు. అలాగే 600 రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయంను సీఎం కేసీఆర్ అందించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ పాల్గొనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లంచ్ మీటింగ్ ముగిసింది. కాసేపట్లో పంజాబ్ బయల్దేరతారు ఇద్దరు ముఖ్యమంత్రులు. అక్కడి సీఎం భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి.. రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఉద్యమంలో భాగంగా అశువులు బాసిన రైతు కుటుంబాలకు అండగా నిలవనున్నారు కేసీఆర్. ఒక్కో ఫ్యామిలీకి మూడేసి లక్షల రూపాయల సాయం అందించనున్నారు. ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలోతెలంగాణ సీఎం కేసీఆర్ బిజిబిజీగా ఉన్నారు. కేజ్రీవాల్‌తో లంచ్ మీటింగ్‌లో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది ఆసక్తిగా మారింది. నిన్న జాతీయ విద్యా విధానాన్ని తప్పుపట్టిన కేసీఆర్.. రైతుల సాక్షిగా ఇవాళ ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది.
అటు తొలిసారి ఏకధాటిగా 10 రోజులపాటు 5 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యామ్నాయమే ప్రధాన ఎజెండాగా సాగే పర్యటనపై అందరి దృష్టి పడింది. ఇవాళ చండీగఢ్‌కు వెళ్లనున్న కేసీఆర్, జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన 600 రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. మే 26న ఉదయం బెంగళూరులో పర్యటిస్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు.
మే 27న బెంగుళూరు నుంచి రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళ్తారు సీఎం కేసీఆర్. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. అనంతరం సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వెళతారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. మే 29 లేదా 30న బంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలను పరామర్శించనున్నారు.