Cloudburst: క్లౌడ్ బరస్ట్.. కుండపోత వర్షాలతో అతలాకుతలం.. ఆ ప్రాంతంలో స్కూళ్లకు సెలవు..

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షాలు పడ్డాయి. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగి.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డెహ్రాడూన్‌లో తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తికొచ్చాయి. కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లులు ధ్వంసమయ్యాయి.

Cloudburst: క్లౌడ్ బరస్ట్.. కుండపోత వర్షాలతో అతలాకుతలం.. ఆ ప్రాంతంలో స్కూళ్లకు సెలవు..
Uttarakhand Rains

Updated on: Sep 16, 2025 | 9:33 AM

దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసాకి ప్రకృతి విలయం సృష్టించింది. డెహ్రాడూన్‌లో ఆకాశానికి చిల్లుపడ్డట్టు కురిన కుంభవృష్టితో తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌లో తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తికొచ్చాయి. పలు ప్రాంతాలు నీటమునిగి.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లులు ధ్వంసమయ్యాయి. అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతు అయిన ఇద్దరు వ్యక్తులను కాపాడేందుకు రెస్క్య టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్‌లోని పాఠశాలలు మూసివేశారు.. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

మరోవైపు.. డెహ్రాడూన్‌ క్లౌడ్‌బరస్ట్‌తో రిషికేష్‌లోని చంద్రభాగా నది ప్రవాహం కూడా పెరుగుతోంది. తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించే ఎన్డీఆర్‌ఎఫ్‌ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇంకోవైపు.. పితోరాఘడ్‌ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

వరద ప్రాంతాలకు ఇప్పటికే జిల్లా మేజిస్ట్రేట్ సవిన్ బన్సాల్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కుంకుమ్ జోషి, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు. దాంతో పాటూ డెహ్రాడూన్‌లో ఇక భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్‌లోని పాఠశాలలు మూసివేశారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నాలుగు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఉత్తరకాశీ, చమోలీ, రుద్రప్రయాగ, పౌరీ, భాగగేశ్వర్‌, నైనిటాల్‌ జిల్లాల్లో ఈ వర్షాకాలం సీజన్‌లో క్లౌడ్‌ బరస్ట్‌లు సంభవించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులతో 85 మంది మరణించగా.. 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ లేకుండా పోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..