12-18 ఏళ్ళ మధ్య వయస్సు వారికి త్వరలో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్… సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

| Edited By: Janardhan Veluru

Jun 28, 2021 | 7:41 PM

12-18 ఏళ్ళ మధ్య వయస్సువారిపై జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ పూర్తి అయిందని, దేశంలో ఈ టీకామందు త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

12-18 ఏళ్ళ మధ్య వయస్సు వారికి త్వరలో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్... సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
Clinical Trials Over
Follow us on

12-18 ఏళ్ళ మధ్య వయస్సువారిపై జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ పూర్తి అయిందని, దేశంలో ఈ టీకామందు త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. డీఎన్ఏ వ్యాక్సిన్లను డెవలప్ చేస్తున్న ఈ సంస్థ తన క్లినికల్ ట్రయల్స్ ని ముగించిందని, సమీప భవిష్యత్తులో ఈ వయస్కులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని తన అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. దేశంలో కోవిద్ మేనేజ్ మెంట్ పై సుప్రీంకోర్టు తనకు తానుగా దీనికి సంబంధించిన కేసును విచారిస్తోంది.ఈ ఏడాది అంతానికి అన్ని కంపెనీల నుంచి 135 కోట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని.కేంద్రం పేర్కొంది….ఆగస్టు నుంచి కోవీషీల్డ్ 50 కోట్లు, కోవ్యాగ్జిన్ 40 కోట్లు, బయో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్ 30 కోట్లు, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 10 కోట్ల డోసుల మేర మనకు లభిస్తుందని ఈ అఫిడవిట్ లో వెల్లడించారు. దీంతో చాలావరకు వ్యాక్సిన్ కొరత తీరుతుందని భావిస్తున్నామన్నారు. జూన్ 25 వరకు దేశ వ్యాప్తంగా ప్రజలకు 31 కోట్ల డోసులకు పైగా టీకామందు ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో హెల్త్ వర్కర్స్ కి 1.73 కోట్ల డోసులు ఇచ్చినట్టు. అలాగే 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు 7.84 కోట్ల డోసుల టీకామందు ఇచ్చామని, ఈ సంవత్సరాంతానికి జనాభాకంతటికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నది లక్ష్యమని వివరించారు.

అయితే ఉచిత టీకామందుల విషయంలో ప్రభుత్వ లక్ష్యం నీరు గారేట్టు ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జూన్ 21 న ఇండియూ వ్యాప్తంగా 86 లక్షలమందికి పైగా టీకామంచులు ఇవ్వగా ఆ మరుసటి రోజున అది సుమారు 56 లక్షలకు పడిపోయిన విషయాన్ని ఇవి గుర్తు చేశాయి. ఇప్పటికీ ఈ కార్యక్రమం మందకొడిగా సాగుతోందని, యుద్ధ ప్రాతిపదికన దీన్ని కొనసాగించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: actor Nani : వ్యాక్సిన్ వేయించుకున్న నేచురల్ స్టార్ నాని.. త్వరలోనే షూటింగ్ కు

Delta plus variant: తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు.. బాధితుడి ప్రైమ‌రి కాంటాక్ట్స్ అయిన 16 మంది నుంచి శాంపిల్స్ సేక‌ర‌ణ