కేరళలోని పథనంతిత్త టౌన్ లో గల కెనరా బ్యాంకు బ్రాంచ్ నుంచి రూ. 8 కోట్లు కాజేసిన విజీష్ వర్గీస్ అనే క్లర్కును పోలీసులు బెంగుళూరులో అరెస్ట్ చేశారు. కొంతకాలం నేవీలో పని చేసి మానేసిన 36 ఏళ్ళ క్లర్కును నిన్న ఈ నగరంలో అరెస్టు చేశామని, కేరళకు తీసుకువెళ్తున్నామని ఖాకీలు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచికి అప్పగించే ముందే ‘సిట్’ అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. గత ఫిబ్రవరి నుంచి వర్గీస్ కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. తన భార్య, ఇద్దరు పిల్లలతో బాటు పరారీలో ఉన్న వర్గీస్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వివిధ ప్రాంతాలు తిరిగాడని తెలిసింది. నెల రోజుల క్రితం ఇతని కారును పోలీసులు కొచ్చిలో ట్రేస్ చేశారు.పారిపోవడానికి ఈ కారునే వినియోగించినట్టు భావిస్తున్నారు. 2019 జూన్ నుంచి పథనంతిత్త లోని కెనరా బ్యాంకులో క్లర్కుగా పని చేస్తున్న వర్గీస్ అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరి విశ్వాసాన్ని సంపాదించాడు. ఇతని ప్రవర్తనపై ఎవరికీ అనుమానం రాలేదని తెలిసింది. బ్యాంకులో పని చేస్తున్న ఓ ఉద్యోగి భార్యకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ ని ఇతడు క్లోజ్ చేశాడని తెలియవచ్చింది. దాంతో ఆ ఉద్యోగికి అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
అయితే ఈ ఫ్రాడ్ జరిగినట్టు అధికారులు గుర్తించే లోపే వర్గీస్ పరారయ్యాడు. ఈ మోసానికి సంబంధించి బ్యాంకు మేనేజర్ తో బాటు 5 గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Prabhas Adipurush video : ప్రాణాలు రిస్క్‌లో పెట్టలేను డార్లింగ్.. ఆదిపురుష్ కు తప్పని కష్టాలు..నిర్మాతలను ఒప్పించినా ప్రభాస్ ..(వీడియో).