అల్లోపతి మందులవల్లే దేశంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయంటూ యోగాగురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారం రేపాయి. అల్లోపతి విధానాన్ని ఆయన విమర్శిస్తున్నారని, డాక్టర్లను, వైద్య సిబ్బందిని అవమానపరుస్తున్నారని, కించ పరుస్తున్నారని అనేకమంది ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయనకు లీగల్ నోటీసును కూడా పంపింది. ఇందులో ఆయనను దుయ్యబట్టింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ సైతం రాందేవ్ బాబా వ్యాఖ్యలపై స్పందిస్తూ..వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అలోపతి మందులపై మీరు చేసిన కామెంట్స్ ఈ దేశ ప్రజలను ఎంతో బాధించాయని, ఇప్పటికే మీకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశానని ఆయన అన్నారు. కోవిద్ రోగులకు డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అపారమని, రోగులకు వారు దేవుళ్ళ వంటివారని, పేషంట్లను రక్షించడానికి వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయడం లేదన్నారు. మీ స్టేట్ మెంట్ ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతున్నానన్నారు.కాగా బాబా నేతృత్వంలోని పతంజలి యోగా సంస్థ దీనిపై వివరణ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ఎడిట్ చేశారని, ఆధునిక సైన్స్ మీద ఆయనకు ఎంతో గౌరవం, విశ్వాసం ఉన్నాయని పేర్కొంది.వీటిపై బాబాకు ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరించింది. బాబా రామ్ దేవ్ పాల్గొన్న ఈవెంట్ లో తనకు అందిన వాట్సాప్ సందేశాన్ని ఆయన చదివారని,అంతే తప్ప ఆయనకు ఆపాదిస్తూ వచ్చిన సమాచారం తప్పుడుదని పేర్కొంది.
అటు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ కూడా బాబా రాందేవ్ కి లీగల్ నోటీసు పంపింది.
మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో
వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.