‘టూల్ కిట్’ కేసులో బీజేపీ నేతలు రమణ్ సింగ్, సాంబిత్ పాత్రాలపై ఎఫ్ఐఆర్ నమోదు, సమన్లు జారీ చేశామన్న ఛత్తీస్ గఢ్ పోలీసులు
'టూల్ కిట్' కేసులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్, పార్టీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్రాలకు ఛత్తీస్ గఢ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. వీరు విచారణ నిమితం వ్యక్తిగతంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ....
‘టూల్ కిట్’ కేసులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్, పార్టీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్రాలకు ఛత్తీస్ గఢ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. వీరు విచారణ నిమితం వ్యక్తిగతంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ హాజరు కావాలని రాయపూర్ సివిల్ లైన్స్ పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు ఆకాష్ శర్మ వీరిపై ఫిర్యాదు చేశారని, దీంతో ఎఫ్ఐఆర్ దాఖలు చేశామన్నారు.కాగా- రమణ్ సింగ్, సాంబిత్ పాత్రా ఏఐసీసీ రీసెర్చ్ డిపార్ట్ మెంట్ లెటర్ హెడ్ ను ఫోర్జరీ చేశారని, వక్రీకరించి, తప్పుడు కంటెంట్ ని ప్రింట్ చేయించారని ఆకాష్ శర్మ ఆరోపించారు. అటు.. బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పార్టీ నేత సాంబిత్ పాత్రా , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్. సంతోష్ పై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.బీజేపీ ఇటీవల కాంగ్రెస్ పార్టీని ‘టూల్ కిట్’ విపక్షంగా ఆరోపిస్తూ.. ఈ దేశాన్ని, ప్రధాని మోదీ ప్రతిష్టను కించపరచడానికి ప్రయత్నించిందని పేర్కొంది. . అయితే ఆ పార్టీ విమర్శలను కాంగ్రెస్ తిప్పి కొడుతూ అది ఫేక్ టూల్ కిట్ పార్టీ అని, ఫేక్ న్యూస్ ని వ్యాప్తి చెందింపజేస్తోందని తాను కూడా ఆరోపించింది.
ఇదిలా ఉండగా సాంబిత్ పాత్రా తరఫున ఆయన లాయర్ స్పందిస్తూ యాస్ తుఫాను కారణంగా బాధితులకు సహాయ చర్యల్లో తమ క్లయింటు బిజీగా ఉన్నందున ఇంత తక్కువ సమయంలో విచారణకు హాజరు కాలేరని రాయపూర్ పోలీసులకు తెలిపారు. కనీసం వారం రోజుల ముందైనా నోటీసు పంపాల్సి ఉండిందన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో
వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.