Chief Justice of India: తన వారసుడిని ప్రకటించిన సీజేఐ యూయూ లలిత్.. అతను ఎవరంటే..

|

Oct 11, 2022 | 10:57 AM

భారత ప్రధాన న్యాయమూర్తి ఉమేష్ లలిత్ నవంబర్ 8న తన పదవి నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వారసుడి పేరిట లేఖను అందజేశారు. తన వారసుడిగా..

Chief Justice of India: తన వారసుడిని ప్రకటించిన సీజేఐ యూయూ లలిత్.. అతను ఎవరంటే..
CJI Uu Lalit
Follow us on

భారత సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై ఇవాళ కీలక నిర్ణయం రానుంది. కొద్ది సేపటి క్రితం (అక్టోబర్ 11) ఉదయం 10.15 గంటలకు న్యాయమూర్తుల లాంజ్‌లో న్యాయమూర్తులతో సమావేశమయ్యారు ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్. ఈ సందర్భంగా ఆయన తన వారసుడి పేరిట లేఖను అందజేశారు. తన వారసుడిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ను సిఫార్సు చేశారు సీజేఐ యూయూ లలిత్.  జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేసే ముందు.. సీజేఐ తన వారసుడిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తిని నియమించడం రివాజు. దీంతో జస్టిస్ డివై చంద్రచూడ్ దేశానికి 50వ ప్రధాన న్యాయమూర్తి అయ్యే ఛాన్స్ ఉంది.

వారసుడిని ప్రకటించారు 

అంతకుముందు, న్యాయ మంత్రి కిరణ్ రిజిజు తన వారసుడి పేరును ప్రకటించాలంటూ అక్టోబర్ 7 న సీజేఐ లలిత్‌కు లేఖ రాశారు. ఇవాళ ఆయన తన వారసుడి పేరును ప్రకటించనున్నారు. ఈ సమావేశం గురించి తెలియజేస్తూ న్యాయమూర్తులందరికీ సీజేఐ యూయూ లలిత్ సోమవారం లేఖ రాశారు.

న్యాయస్థానం నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన రెండో సీజేఐ జస్టిస్ లలిత్. జనవరి 1971లో 13వ సీజేఐగా నియమితులైన జస్టిస్ SM సిక్రీ మొదటివారు. జస్టిస్ లలిత్ తండ్రి జస్టిస్ యుఆర్ లలిత్ కూడా సీనియర్ న్యాయవాది. బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి కూడా ఆయన పనిచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం