CJI NV Ramana: కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీరమణ

|

Apr 30, 2022 | 12:11 PM

న్యాయవ్యవస్థ ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు పెరగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (NV Ramana) ఆందోళన వ్యక్తం చేశారు

CJI NV Ramana: కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీరమణ
Nv Ramana
Follow us on

న్యాయవ్యవస్థ ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు పెరగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (NV Ramana) ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కోర్టుల్లో సిబ్బందిని త్వరితగతిన నియమించాలని సీజేఐ సూచించారు. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌ వేదికగా జరిగిన హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సులో ఎన్వీ రమణ ఈ మాటలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ (PM NarendraModi) ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీజేఐ ఎన్వీరమణ.. ‘ న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముంది. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే. అదేవిధంగా వార్డు సభ్యుడి నుంచి లోక్‌సభ సభ్యుడివరకు అందరూ న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించాల్సిందే. చట్టం అందరికీ సమానమే. అధికార వర్గం తన బాధ్యతలు సమర్థంగా, సక్రమంగా నిర్వహిస్తే కోర్టు కేసులు తగ్గిపోతాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశౄలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 66 శాతం భూతగాదాలవే. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పూర్తి నిరుపయోగంగా మారుతున్నాయి. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 20 మంది న్యాయమూర్తులే ఉంటున్నారు. ఫలితంగా కోర్టు్ల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేసుల పరిష్కారం కోసం కిందిస్థాయి కోర్టు్ల్లో మరింత మంది సిబ్బందిని త్వరితగతిన నియమించాలి’ అని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

కాగా సీజేఐ ఎన్వీ రమణ చొరవతో ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ సదస్సు జరిగింది. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు.

మరిన్న జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Crime News: ట్యాక్సీడ్రైవర్ దాష్టీకం.. తల్లితో సహజీవనం చేస్తూనే కుమార్తెపై అత్యాచారం..

Reliance Jio: ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఈ జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లు మీకోసమే..

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?