Viral: పైకి చూసి ట్రాలీ బ్యాగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అసలు విషయం తెలిస్తే షాకే!

|

Jan 30, 2023 | 9:47 AM

పైకి చూసి ట్రాలీ బ్యాగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అతడు ఏం తీసుకెళ్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

Viral: పైకి చూసి ట్రాలీ బ్యాగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అసలు విషయం తెలిస్తే షాకే!
Representative Image
Follow us on

అక్రమార్కులు తెలివి మీరిపోయారు. పోలీసులు, కస్టమ్స్ అధికారుల కంట పడకుండా తమ దండాను కొనసాగిస్తున్నారు. సినిమాల ప్రభావమో.. లేక మరేదోనో.. సరికొత్త ప్లాన్స్‌తో మాదకద్రవ్యాలు, విదేశీ కరెన్సీ, గంజాయి తదితర వాటిని చాకచక్యంగా విదేశాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. అలాంటి వారి ఆటలు కట్టించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు.

ఇటీవల ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి కదలికలు కాస్త అనుమానంగా కనిపించగా.. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుని.. పూర్తిస్థాయిలో తనిఖీలు చేశారు. ఆ వ్యక్తి దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగ్స్‌ను పరిశీలించగా.. వాటి హ్యండిల్స్‌లో విదేశీ నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ. 64 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడ్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.