బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి ఇంటివద్ద సీఐడీ బృందం.. పర్సనల్ గార్డ్ సూసైడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

| Edited By: Phani CH

Jul 14, 2021 | 9:04 PM

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి ఇంటిని సీఐడీ అధికారుల బృందం బుధవారం సందర్శించింది. 2018 లో ఆయన పర్సనల్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకోగా ఆ కేసుకు సంబంధించి ఈ బృందం పూర్బా మెడ్నిపూర్ లోని ఆయన ఇంటికి చేరుకొని వివరాలు సేకరించింది.

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి ఇంటివద్ద సీఐడీ బృందం.. పర్సనల్ గార్డ్ సూసైడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
Suvendu Adhikari
Follow us on

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి ఇంటిని సీఐడీ అధికారుల బృందం బుధవారం సందర్శించింది. 2018 లో ఆయన పర్సనల్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకోగా ఆ కేసుకు సంబంధించి ఈ బృందం పూర్బా మెడ్నిపూర్ లోని ఆయన ఇంటికి చేరుకొని వివరాలు సేకరించింది. సుబబ్రత చక్రవర్తి అనే ఆ గార్డు ఆ ఏడాది తన రివాల్వర్ తో తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. 40 ఏళ్ళ ఈయన అధికారి సెక్యూరిటీలో చాలా కాలంగా పని చేస్తున్నాడు. 2015 లో సువెందు అధికారి ఎంపీగా, ఆ తరువాత సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడై మంత్రిగా ఉన్నప్పుడు కూడా అయన బాడీ గార్డుగా ఉన్నాడు. కానీ ఏ కారణం వల్లో 2018 లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ ఇన్నేళ్లకు అతని భార్య సుపర్ణ చక్రవర్తి తన భర్త మరణం అనుమానాస్పదంగా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాజాగా దీనిపై దర్యాప్తు జరగాలని కోరింది. సువెందు అధికారి పెద్ద రాజకీయ నేత అని, ఆయనపై ఫిర్యాదు చేసేందుకు తాను భయపడ్డానని కానీ ఇప్పుడు ధైర్యంతో కంప్లయింట్ చేస్తున్నానని ఆమె పేర్కొంది. తన భర్త అకాల మరణం చెందాడని ఆమె తెలిపింది. ఇప్పటివరకు అధికారికి భయపడుతూ వచ్చానని..కానీ బహుశా నాడు ఏవైనా వేధింపుల కారణంగా తన భర్త సూసైడ్ చేసుకుని ఉండవచ్చునని భావించి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఇదంతా రాజకీయ కక్ష అంటూ సువెందు అధికారి ఆరోపించారు. ఆమె భర్త ఆత్మహత్యకు తాను ఎలా కారణమవుతానని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో తనమీద కక్ష గట్టిందన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: RBI: షాకింగ్‌ న్యూస్‌.. ఇక ఆ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ

లడాఖ్ లో ఆమిర్ ఖాన్, కిరణ్ రావు ఫోక్ డ్యాన్స్ చూడాల్సిందే.. ఫ్యాన్స్ సంబరం..