Chola period Panchaloha Ancient Idols: దక్షిణ భారత దేశంలో తమిళనాడు 6000 సంవత్సరాలు పైగా పురాతన చరిత్ర కలిగిన ప్రాంతం. తమిళనాడు, చుట్టుప్రక్కల ప్రాంతాలను వేరువేరు కాలాలలో పల్లవ, చేర, చోళ, పాండ్య, చాళుక్య, విజయనగర రాజుల పాలన సాగింది. ఆయా రాజులు తమిళనాడులో అనేక ఆలయాలను, చారిత్రాత్మక భవనాలు, బహుళ-మత తీర్థయాత్రాస్థలాలను నిర్మించారు. పర్యాటకులను ఆకర్షించే హిల్ స్టేషన్లను మూడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలను అప్పటి రాజులు అందించారు. అప్పటి రాజులు వైభవం చారిత్రాత్మక ఆనవాలు ఇప్పటికీ తవ్వకాల్లో బయల్పడుతున్నాయి. తమిళనాడు ప్రాంతాన్ని 13వ శతాబ్దంలో పాలించిన రోజుల్లో చోళలు ముఖ్యలు. చోళుల సామ్రాజ్యం కావేరి నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. అయితే తాజాగా చోళ రాజులు కట్టించిన ఆలయ తవ్వకాల్లో పంచలోహ విగ్రహాలు బయల్పడ్డాయి. ఈ విగ్రహాలు అతిపురాతనమైనవి కావడంతో వాటి విలువ కొన్ని కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
నాగపట్నం జిల్లాలోని దేవపురిస్వరాలయం అతి ప్రాచీనమైనది. ఈ శివాలయాన్ని చోళ రాజుల కాలంలో నిర్మించారు. స్థలపురాణంలో ఆలయం విశిష్టత గురించి గొప్పగా వివరించడంతో నిత్యం ఆలయంలో వేలసంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుంది. ఈ క్రమంలో ఆలయంలో మరమ్మతులకు మండపంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో అతి ప్రాచీనమైన పంచలోహ విగ్రహం బయటపడింది. దీంతో వెంటనే గ్రామస్థులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు జెసిబి సహాయం తో ఆలయ పరిసర ప్రాంతాల్లో మరిన్ని చోట్ల తవ్వకాలు జరిపించారు. దీంతో అక్కడ 14 అతిపురాతనమైన పంచలోహ విగ్రహాలు, 10 కి పైగా పూజలకు ఉపయోగించే సామాగ్రి బయటపడ్డాయి . పురావస్తు శాఖ అధికారులు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై పరిశోధనలు చేయనున్నామని తెలిపారు. ఈ విగ్రహాలు చోళ రాజులకాలం నాటివి కనుక వీటి విలువ కోట్లలో ఉంటుంది కనుక గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు శివాలయం లోని మండపం తో సహా అన్ని ప్రాంతాల్లో మరిన్ని తవ్వకాలను జరపాలని అధికారులను ఆదేశించారు.
Read Also:పరీక్షకు వెళ్తూ ప్రమాదం..14 ఆపరేషన్లు.. నడవలేవంటూ వదిలేసిన భర్త.. నేడు సివిల్స్ లో టాపర్..