Chlorine Gas Accident: క్లోరిన్ గ్యాస్ లీకేజీ వీడియో.. పరుగులు తీసిన విద్యార్థులు

|

Nov 03, 2023 | 6:16 PM

మన చుట్టు పరిసరాల్లో అప్పుడప్పుడు కొన్ని గ్యాస్ లీకేజి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం సంభవిస్తే మరి కొన్ని చోట్లు అస్వస్థతుకు గురవుతూ ఉంటారు. గతంలో ఏపీలో కూడా కొన్ని చోట్ల పరిశ్రమల నుంచి గ్యాస్ లీకేజీ సంఘటనలు చాలా సార్లు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్లోని మధురలో చోటు చేసుకుంది. ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలోని ఆవరణలో దట్టమైన క్లోరిన్ గ్యాస్ లీకైంది. దీంతో చాలా మంది సృహ కోల్పోయారు.

Chlorine Gas Accident: క్లోరిన్ గ్యాస్ లీకేజీ వీడియో.. పరుగులు తీసిన విద్యార్థులు
Chlorine Gas Leakage At Mathura Cmo's Campus Students Struggling To Breath Surface Watch Video
Follow us on

మన చుట్టు పరిసరాల్లో అప్పుడప్పుడు కొన్ని గ్యాస్ లీకేజి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం సంభవిస్తే మరి కొన్ని చోట్లు అస్వస్థతుకు గురవుతూ ఉంటారు. గతంలో ఏపీలో కూడా కొన్ని చోట్ల పరిశ్రమల నుంచి గ్యాస్ లీకేజీ సంఘటనలు చాలా సార్లు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్లోని మధురలో చోటు చేసుకుంది. ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలోని ఆవరణలో దట్టమైన క్లోరిన్ గ్యాస్ లీకైంది. దీంతో చాలా మంది స‌ృహ తప్పి పడిపోయారు. కొందరికి వాంతులు కాగా మరి కొందరు నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

మధుర సీఎంఓ కార్యాలయంలో క్లోరిన్ గ్యాస్ లీకేజ్ జరిగింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నర్సింగ్ విద్యార్థులు.ఈ సంఘటన నర్సింగ్ విద్యార్థులు మరియు సిబ్బందిని భయాందోళనలకు గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) క్యాంపస్‌లో శుక్రవారం క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటనతో చాలా మంది పరుగులు తీశారు. ఇందులో 10 మంది నర్సింగ్ విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. క్యాంపస్ ఆవరణలో చాలా మంది నర్సింగ్ విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. స్టోరేజీ సిలిండర్ నుంచి క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. ఇలాంటి ఘోర ప్రమాదాల గురించి ఆందోళనల చెందుతున్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

నిన్నటి నుంచి సిలిండర్ సమస్య ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. ఈరోజు అకస్మాత్తుగా దట్టమైన గ్యాస్ వెదజల్లడంతో అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిస్థితి గురించి అందరికీ తెలుసు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని నర్సింగ్ విద్యార్థి తెలిపారు. ఈ అమానుష ఘటనపై మధుర సీఎంవో స్పందించింది. ఇందులో సిబ్బంది తరఫున ఎలాంటి నిర్లక్ష్యం లేదని మధుర సీఎంఓ డాక్టర్ అజయ్ కుమార్ వర్మ తెలిపారు. నిన్న, మేము క్యాంపస్‌లో వింత వాసనను పసిగట్టామన్నారు. ఇందులో భాగంగా అగ్నిమాపక శాఖను పిలిపించామని తెలిపారు. తక్షణం స్పందించిన ఫైర్ సిబ్బంది చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ పరిశీలించి పరిస్థితిని నియంత్రించారు. అయితే ఈ రోజు, ఉదయం 11 గంటల నుండి మళ్లీ వాసన వచ్చింది. అగ్నిమాపక శాఖ సమస్యను గుర్తించిందని డాక్టర్ వర్మ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలలో పలువురు నర్సింగ్ విద్యార్థులు దగ్గుతున్నట్లు కనిపించింది. మరి కొందరు వాంతులు చేసుకున్నారని డాక్టర్ వర్మ చెబుతున్నారు. ఈ వాసనకు నేలపై కుప్పకూలిపోగా, మరికొందరు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై కొంతమంది విద్యార్థులు ఆందోళన చెందారు. వారిని బయటకు తీసుకువచ్చి ధైర్యం చెప్పే ప్రయాత్నం చేశారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఇది పాత సమస్యే అని చెప్పారు అక్కడి సిబ్బంది. పంపింగ్ స్టేషన్‌తో పాటూ సిలిండర్లు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో అందులో క్లోరిన్ నిండి ఉంటుందని వివరించారు.

 

 

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.