
భారత సైనిక శిబిరాలకు చైనా సైనికులు చేరువవుతున్నారు. పొడవాటి కర్రలకు కొడవళ్లు కట్టిన ఆయుధాలు, ఆటోమాటిక్ రైఫిళ్లతో ఇలా వారు స్పష్టంగా కనబడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి మధ్య యుగం నాటి ఆయుధాల్లా కనిపిస్తున్నాయి. గాల్వన్ లోయలో గత జూన్ 15 న భారత దళాలతో ఘర్షణకు దిగినట్టే మళ్ళీ అదే తరహా దాడులకు తెగబడాలని వారు భావిస్తున్నట్టు కనబడుతోంది. నాటి ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. లడాఖ్ లోని పాంగంగ్ సరస్సు సమీపాన రెబిన్ లా-రేజంగ్లా-ముఖాపురి-మగర్ హిల్స్ పై వీరు కనబడగానే మన జవాన్లు కేకలు పెట్టి కాల్పులు జరిపారని, వారు కూడా కాల్పులు జరిపారని తెలుస్తోంది.